శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 11, 2020 , 00:11:13

పశుగణాభివృద్ధికి మరింత తోడ్పాటు

పశుగణాభివృద్ధికి మరింత తోడ్పాటు

కరీంనగర్‌ కార్పొరేషన్‌: తెలంగాణలో పశుగణాభివృద్ధి కోసం ప్రభుత్వం రైతులకు మరింత తోడ్పాటునందిస్తున్నదని, ఇందులో భాగంగానే కరీంనగర్‌లో ఘనీకృత ఆబోతుల వీర్య నాణ్యతా నిర్ధారణ ప్రయోగశాలను ఏర్పాటు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్‌లోని ఘనీకృత ఆబోతుల వీర్య ఉత్పత్తి కేంద్రంలో రూ.50 లక్షలతో ఏర్పాటు చేసిన వీర్య నాణ్యతా పరీక్షల నిర్ధారణ ప్రయోగశాలను మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. అలాగే జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశుగణాభివృద్ధి సేవల కోసం వీర్య ఉత్పత్తి కేంద్రంలో సంవత్సరానికి ఉత్పత్తి అయ్యే 20 లక్షల డోసులకు సంబంధించి నాణ్యతా పరీక్షలు చేయడానికి ప్రయోగశాల ఎంతో దోహదపడుతుందన్నారు. ఇది రాష్ట్రంలోనే మొదటిదని తెలిపారు. దీనివల్ల మేలు జాతి పశు ఉత్పత్తి పెరుగుతుందన్నారు.

ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయంలోకి 5 లక్షల చేప పిల్లలు..

బోయినపల్లి: మండలంలోని మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో రాష్ట్ర మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి ఐదు లక్షల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ విజన్‌తో ఎస్‌ఆర్‌ఆర్‌, దిగువ మానేరు జలాశయాల్లోకి భారీగా నీరు రావడంతో రైతులు, మత్స్య కార్మికులు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయంలో మత్స్య కార్మికులతో పాటు, వేల మంది నిర్వాసితులకు సైతం చేపలు పట్టుకుని జీవనోపాధి పొందేందుకు లైసెన్స్‌లు ఇచ్చామని పేర్కొన్నారు. చేప పిల్లల క్వాలిటీ, సైజు, కౌంటింగ్‌లో ఎలాంటి తేడా రాదన్నారు. వాటిని పంపిణీ చేసేటప్పుడు వీడియో గ్రాఫర్‌, ఫొటో గ్రాఫర్‌, సొసైటీ సభ్యులు, అధికారులు ఉండాలని, ఎలాంటి తేడా వచ్చినా తిరిగి పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, సీఈ వో మంజువాణి, కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక, మేయర్‌ వై సునీల్‌రావు, రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరు ణ, అడిషనల్‌ కలెక్టర్‌ అంజయ్య, ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయం ఈఈ రామకృష్ణ, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకుడు రాంచందర్‌, బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌, జడ్పీటీసీ కత్తెరపాక ఉమ కొండయ్య, డీఈఈ రాజు, తహసీల్దార్‌ ధార ప్రసాద్‌, ఎంపీడీవో రాజేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మాజీ జడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, ఎంపీటీసీలు ఐరెడ్డి గీత, ఉపేందర్‌, సర్పంచులు బూర్గుల నందయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు కత్తెరపాక కొండయ్య, సంబ లక్ష్మీరాజం, అనుముల భాస్కర్‌ పాల్గొన్నారు. 


logo