శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 10, 2020 , 01:37:52

ఆరోగ్య భద్రత.. ప్రభుత్వ బాధ్యత

 ఆరోగ్య భద్రత.. ప్రభుత్వ బాధ్యత

మంథనిటౌన్‌: ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత.. ప్రభుత్వం బాధ్యతని పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సమైక్య పాలనలో ఎప్పుడో తప్పా సీఎం సహాయనిధి పేరే వినిపించేది కాదని, ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం ఆపదలో ఉన్న నిరుపేదలందరికీ సీఎం సహాయనిధిని అందజేస్తూ అండగా నిలుస్తున్నదని చెప్పారు. మంథనిలోని ఆయన నివాసం లో నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన 72 మంది లబ్ధిదారులకు రూ.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను భూపాలపల్లి జడ్పీ చైర్మన్‌ జక్కు శ్రీహర్షిణీతో కలిసి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

  వివిధ కారణాలతో ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స చేయించుకున్న నియోజకవర్గంలోని ప్రజలకు దాదాపు రూ.8 కోట్ల సహాయనిధి అందజేసిన ఘనత  ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు విద్య, వైద్యమందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని అర్హులకు అందేలా చూ డాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. వైద్యం చేయించుకున్న ఆరు నెలల్లోగా సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యకర్తలను కడుపులో పెట్టికాపాడుకుంటామని చెప్పారు. ఇటీవల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు పార్టీ కార్యకర్తలు మరణిస్తే బాధిత కుటుంబాలకు బీమా చెక్కులను అందజేశామన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా టీఆర్‌ఎస్‌ నేత జక్కు రాకేశ్‌, ఎంపీపీలు కొండ శంకర్‌, ఆరెల్లి దేవక్క కొమురయ్య, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, మంథని, కాటారం పీఏసీఎస్‌ చైర్మన్లు కొత్త శ్రీనివాస్‌, చల్లా నారాయణరెడ్డి, కమాన్‌పూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మంథని మండలాధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


logo