శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 09, 2020 , 00:43:06

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి

కరీంనగర్‌ హెల్త్‌: ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు.  జిల్లా కేంద్రంలోని  ప్రభుత్వ దవాఖానను శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా దవాఖాన ఆవరణలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ నిర్మించే, మ్యాన్‌పోల్డ్‌ స్థాపించే స్థలాన్ని పరిశీలించి ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ దవాఖానలో ఆక్సిజన్‌ పైపులైన్‌ పనులు సోమవారం వరకు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న వెంటిలేటర్లు, మొబైల్‌ ఎక్స్‌రే, ఈసీజీ మిషన్లు, మానిటర్లు పూర్తిస్థాయిలో వినియోగించి రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. అవసరమైతే మరిన్ని మానిటర్లు, ఇతర పరికరాలు కూడా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్ప్‌ డెస్క్‌ల ద్వారా రోగులకు తగిన సహాయం అందిస్తూ, వారికి అవసరమయ్యే వైద్యం అందించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో దవాఖాన సూపరింటెండెంట్‌ రత్నమాల, ఆర్‌ఎంవో శౌరయ్య, డాక్టర్‌ అలీం, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. logo