గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Aug 09, 2020 , 00:24:35

భూదందాలపై బిగుస్తున్న ఉచ్చు

భూదందాలపై బిగుస్తున్న ఉచ్చు

(కరీంనగర్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కరీంనగర్‌ రూరల్‌)

బొమ్మకల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో జరిగిన భూదందాలపై విచారణను మరింత లోతుగా చేయడంతోపాటు స్పీడ్‌ పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం మూడు శాఖల అధికారులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఆర్డీవో ఆధ్వర్యంలో గ్రా మ పంచాయతీలోని సర్వే నంబర్‌ 250, 274, 656 భూములతోపాటు సర్వేనంబర్‌ 17లోనూ విచారణ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్న అధికారులు విషయాలను మాత్రం బయటకు వెల్లడించడం లేదు. మరో వైపు కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం జిల్లా పరిషత్‌ కార్యనిర్వాహక అధికారి ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన కమిటీ శనివారం బొమ్మకల్‌ పంచాయతీకి వెళ్లి రికార్డులను పరిశీలించింది. కరీంనగర్‌ పంచాయతీ విస్తరణ అధికారి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా రికార్డులను పరిశీలించారు. వీటన్నింటినీ సీజ్‌ చేసి త్వరగా తనిఖీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు పంచాయతీ ఆధ్వర్యంలో ఇండ్ల నిర్మాణ పర్మిషన్లు, పంచాయతీ బిల్లులు, ఇంటి నెంబర్లు, డి మాండ్‌ రిజిస్టర్లు, లేఅవుట్ల పర్మిషన్లు, గ్రామపంచాయతీ బ్యాంకు ఖాతా, బ్యాంకు చెల్లింపుల చ లాన్లు ట్రెజరీ రికార్డులతో పాటు పంచాయతీలోని వివిధ రికార్డులను పరిశీలిస్తున్నారు.  ప్రభుత్వ భూముల్లో అనుమతులు ఇచ్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది. వాటిని మరోసారి పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు పత్రాలు కావాలని పోలీసులు కోరగా.. వాటి కోసం రికార్డులు తనిఖీ చేస్తున్నారు. ఇందులో సర్వేనంబర్‌ 28, 728లో ఇండ్లకు సంబంధించిన పత్రాలున్నాయి. 

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)

బొమ్మకల్‌ భూదందాలపై కఠినంగా వ్యవహరించాలని, గ్రామంలోని ప్రభుత్వ, శిఖం భూ ములు ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం లో సీపీ కమలాసన్‌రెడ్డితో కలిసి తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా కేంద్రం పక్కనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని, తప్పు చేసిన వారికి శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు. భూములను సర్వే చేసేందుకు ఆర్డీవో స్థాయిలో ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్‌ ఆర్డీవో పర్యవేక్షణలో బొమ్మకల్‌, కొత్తపల్లి సర్వేయర్లు బొమ్మకల్‌లోని ప్రభుత్వ, మిగతా భూ ములను సర్వే చేయాలన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి రిజిస్ట్రేషన్లు చేయించినట్లు తెలుస్తున్నదని, ఈ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములపై సర్వేనెంబర్ల వారీగా విచారణ జరపాలని, అక్రమాలను గుర్తించి ఇందుకు కారకులైన వారికి శిక్ష పడేలా, సామాన్యులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. బొమ్మకల్‌ విషయంలో రెండు సంవత్సరాలుగా ఫిర్యాదులు వస్తున్నాయ ని, కొంతమంది ప్రభుత్వ భూములను కబ్జా చే స్తున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశామని చెప్పారు. ప్లాట్‌ ఓనర్లను బెదిరించడం, ప్రభు త్వ, శిఖం భూములను కబ్జా చేయడం, ప్రభుత్వ భూమిని అగ్రిమెంట్‌ చేయడం, భూమిని ఆక్రమించుకుని పెద్దఎత్తున భూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. బొమ్మకల్‌, సీతారాంపూర్‌తోపాటు పలు గ్రామాల్లో భూ కబ్జాలు జరుగుతున్నాయన్నారు. అక్రమాలు చేసిన వారెవరైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో ఆనంద్‌కుమార్‌ మాట్లాడుతూ కలెక్టర్‌ ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో  నల్లా వెంకట్‌రె డ్డి (కరీంనగర్‌అర్బన్‌ తహసీల్దార్‌), జీ సుధాకర్‌ (కరీంనగర్‌రూరల్‌ తహసీల్దార్‌), సీహెచ్‌ సందీప్‌ (హుజూరాబాద్‌ నాయబ్‌ తాసీల్దార్‌), సీహెచ్‌ ఎన్‌ కిషన్‌ (నాయబ్‌ తాసీల్దార్‌, ఈపీఐసీ మానకొండూర్‌), సేవ్యా నాయక్‌ (డీఐ, కరీంనగర్‌), వేణు ( మండల సర్వేయర్‌ ఎడీ, ఎస్‌ఎల్‌ఆర్‌, కరీంనగర్‌), రత్నం (సర్వేయర్‌, ఎడీ, ఎస్‌ఎల్‌ఆర్‌, కరీంనగర్‌) ఒక బృందంగా పనిచేస్తున్నామని తెలిపారు. తమ బృందం ఇప్పటి వరకు 652, 695, 108, 99, 105, 228, 96 సర్వే నంబర్లలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ సేవ్యా నాయక్‌ ఆధ్వర్యంలో మొత్తం 87.25 ఎకరాలు సర్వే చేసి జరిగిన అక్రమాలను గుర్తించామన్నారు. ఆక్రమణదారులను గుర్తించి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తామన్నారు. బొమ్మకల్‌లోని మిగతా ప్రభుత్వ సర్వే నెంబర్లలో కూడా సర్వే చేస్తామని, అనంతరం ఆక్రమణలు తొలగిస్తామన్నారు. పంచాయతీ శాఖ ద్వారా ఇంటి నిర్మాణం కోసం బోగస్‌ పర్మిషన్‌ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే రిజిస్ట్రేషన్‌ శాఖ ద్వారా డాక్యుమెంట్లను తెప్పించుకుని వాటిని కూడా పరీక్షించిన అనంతరం అక్రమాలు జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటామన్నారు. వాటిని బోగస్‌ రిజిస్ట్రేషన్‌గా పరిగణించి రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ శిఖం భూ మిలో ఉన్న ఆక్రమణలు తొలగిస్తామన్నారు. కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో మూడు శాఖల సమన్వయ సమావేశం జరిగిందని, కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ భూములపై రెవెన్యూ బృందం నివేదిక ఇవ్వనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో డీ వెంకట మాధవరావు, సీఐ తుల శ్రీనివాస్‌రావు, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.logo