గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Aug 08, 2020 , 01:24:19

ఆడబిడ్డలకు సర్కారు అండ

ఆడబిడ్డలకు సర్కారు అండ

కార్పొరేషన్‌: రాష్ట్రంలోని నిరుపేద ఆడబిడ్డలకు కేసీఆర్‌ సర్కారు అండగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షే మ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లాంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం  కలెక్టరేట్‌  ఆడిటోరియంలో 184 మంది లబ్ధిదారులకు రూ. 1.80 కోట్ల విలువైన చెక్కులను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. స్వాతంత్రం సిద్ధించి 70 ఏండ్లు దాటుతున్నా పేదలకు భరోసానిచ్చిన పాలకులే కరువయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన  వెంటనే సీఎం కేసీఆర్‌ ఆడపిల్లలకు మేనమామలాగా భరోసాని స్తున్నా రని చెప్పారు.  ఈ  కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పుట్ట మధూకర్‌, నగర మేయర్‌ వై సునీల్‌రావు, కార్పొరేటర్లు వీ రాజేందర్‌రావు, దిండిగాల మహేశ్‌, గందె మాధవి, జయశ్రీ, వాల రమణారావు తదితరులు పాల్గొన్నారు. 


తాజావార్తలు


logo