శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 08, 2020 , 00:09:05

నేరాలూ లాక్‌డౌన్‌

నేరాలూ లాక్‌డౌన్‌

మహమ్మారి కరోనా.. దొంగలను సైతం భయపెట్టింది. చెలరేగిపోయే చోర్‌గాళ్లకు చెక్‌పెట్టింది. వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడం, విడుతల వారీగా సడలింపులతో ఎత్తేయడం, పోలీసులు నిరంతరం కర్ఫ్యూ విధించడం, ప్రజలు ఇండ్లకే పరిమితం కావడంతో నేరాలకు దాదాపుగా కళ్లెం పడింది. మార్చి 22 నుంచి తర్వాత నుంచి చోరీల సంఖ్య సగానికి సగం తగ్గి పోయింది. దోపిడీలు, అంతర్రాష్ట్ర ముఠాల ఆగడాలు, నకిలీ కరెన్సీ వంటి కేసులు నమోదు కాకపోగా, ఇతర నేరాలు స్వల్పంగా పెరిగాయి. ఇంటర్నెట్‌ వినియోగం పెరగడంతో అక్కడక్కడా సైబర్‌ మోసాలు వెలుగుచూశాయి.

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ/ కరీంనగర్‌ క్రైం:  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో విధించిన లాక్‌డౌన్‌ నేరాలను అదుపు చేయగలింది. కరీంనగర్‌, రామగుండం పోలీసు కమిషనరేట్‌ల పరిధితోపాటు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో లాక్‌డౌన్‌కు ముందు, లాక్‌డౌన్‌ తర్వాత ఆరు నెలల నేరాల చిట్టాను పరిశీలిస్తే స్వల్పంగా పెరిగాయి. సాధారణ పరిస్థితుల కంటే ఈ నేరాలు చాలా తక్కువని స్వయంగా పోలీసు అధికారులే చెబుతున్నారు. మార్చి 22 నుంచి మే 6 వరకు విధించిన లాక్‌డౌన్‌ సమయంలో పకడ్బందీగా కర్ఫ్యూ విధించారు. పోలీసులు 24 గంటల పాటు రోడ్లపైనే ఉండి జనాలు బయటకు రాకుండా చూశారు. దీంతో నేరగాళ్లకు అవకాశం లేకుండా పోయింది. కరోనా నేపథ్యంలో ఒకరినొకరు తాకకుండా భౌతిక దూరాన్ని పాటించాల్సిన పరిస్థితిలో జేబుదొంగ తనాలు, దోపిడీలు, దారి దోపిడీలు పూర్తిగా తగ్గి పోయాయి. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత కూడా గతంతో పోల్చుకుంటే ఈ నేరాలు చాలా వరకు తగ్గాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

వెంటాడిన భయం.. 

నేర ప్రవృత్తిగల వ్యక్తులకు సైతం కరోనా భయం పట్టుకుందని చెప్పక తప్పదు. నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా ఎక్కడో ఒక చోట నేరాలు ముఖ్యంగా దొంగతనాలు జరుగుతుండేవి. కానీ, కరోనా కారణంగా నేరగాళ్లకు సై తం భయం పట్టుకుంది. ముఖ్యంగా దారి దోపిడీలు, ఇతర దోపిడీలు పూర్తిగా తగ్గిపోయా యి. లాక్‌డౌన్‌ విధించిన మార్చి 22 నుంచి ఇప్పటి వరకు ఈ తరహా కేసులు నమోదు కాలేదు. ఇండ్లలో ఇంటర్నెట్‌ వినియోగం పెరగడంతో అక్కడక్కడా సైబర్‌ మో సాలు వెలుగుచూశా యి.  

కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో..

గత జనవరి నుంచి మార్చి 22 లాక్‌డౌన్‌ వరకు పగటి పూట దొంగతనాలు 6 జరిగితే, మార్చి 22 నుంచి ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే జరిగాయి. రాత్రి దొంగతనాలు లాక్‌డౌన్‌కు ముందు 8 జరిగితే తర్వాత 11 జరిగాయి. సాధారణ దొంగ తనాలు 29 నుంచి 19కి తగ్గాయి. స్వలాభాల కోసం జరిగే హత్యలు లాక్‌డౌన్‌కు ముందు 2 జరిగాయి. ఆ తర్వాత జరగలేదు. హత్యలు లాక్‌డౌన్‌కు ముందు 2 జరిగితే సడలింపు తర్వాత 7 జరిగాయి. లాక్‌డౌన్‌కు ముందు రోడ్డు ప్రమాదాల్లో 42 మంది చనిపోతే లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు 36 మంది మరణించారు. అత్యాచారాలు లాక్‌డౌన్‌కు ముందు 6 జరిగితే లాక్‌డౌన్‌ తర్వాత 4 జరిగాయి. మిస్సింగ్‌ కేసులు లాక్‌డౌన్‌కు ముందు 98 నమోదైతే లాక్‌డౌన్‌ నుంచి ఇప్పటి వరకు 72 నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ ముందు 7 కిడ్నాప్‌ కేసులు నమోదు కాగా, లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పటి వరకు ఒక్క కిడ్నాప్‌ కేసు కూడా నమో దు కాలేదు. పిటీకేసులు, చట్టాల ఉల్లంఘన కేసులు కలిపి జనవరి 1 నుంచి మార్చి 21 వర కు 1,143 కేసులు కాగా, మార్చి 22 నుంచి జూన్‌ 30 వరకు 1,262 నమోదయ్యాయి. ఈ నివేదికలను బట్టి లాక్‌డౌన్‌లో కేసులు తగ్గినా ఆ తర్వాత స్వల్పంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. లాక్‌డౌన్‌ ముందు, లాక్‌డౌన్‌ తర్వాత సాధారణ వివాదాలను పరిశీలిస్తే ముఖ్యంగా సివిల్‌ కేసులు ఎక్కువగానే నమోదైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భూవివాదాలు ఇతర కేసుల సంఖ్య పెరిగింది. సివిల్‌ వివాదాలు లాక్‌డౌన్‌ ముందు 11, తర్వాత 11 నమోదయ్యాయి. సాధారణ సివిల్‌ వివాదాలు లాక్‌డౌన్‌ ముందు 101 న మోదైతే, తర్వాత 163 నమోదయ్యాయి. చీటిం గ్‌ కేసులు తగ్గాయి. లాక్‌డౌన్‌కు ముందు 78, తర్వాత 47కు తగ్గాయి. మహిళలను వేధించ డం, బెదిరింపుల కేసులు తగ్గాయి. ట్రాఫిక్‌ ఉ ల్లంఘనలు, పిటీ కేసులు ఎప్పటి లాగే న మోదయ్యాయి. జనవరి నుంచి జూన్‌ వరకు గడచిన 6 నెలల్లో వివిధ కేసుల్లో రూ. 46.15 లక్షల ఆస్తులు కోల్పోగా, రూ. 24.91 లక్షల రికవరీ జరిగింది.


logo