శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 06, 2020 , 02:40:01

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం

అన్ని వర్గాల  సంక్షేమమే ధ్యేయం

  • lకరోనా సంక్షోభంలోనూ  కొనసాగుతున్న సంక్షేమం
  • lఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ 
  • lరామన్నపేటలో శాలివాహన కులసంఘ భవనానికి శంకుస్థాపన

మల్యాల : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాతో ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతున్నా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలాంటి కోతలు లేకుండా కొనసాగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మల్యాల మండలంలోని రామన్నపేటలో రూ.4.60 లక్షల డీఎంఎఫ్‌టీ నిధులతో నిర్మించనున్న శాలివాహన ( కుమ్మరి) కులసంఘ భవన నిర్మాణానికి గురువారం స్థానిక నాయకులతో కలసి ఎమ్మెల్యే భూమిపూజ చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాధనాన్ని ప్రజల కోసమే సంక్షేమ పథకాల రూపంలో పంపిణీ చేస్తున్నాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్‌, ముంబైలాంటి పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు స్వగ్రామాలకు వస్తున్నారని, వారిని కచ్చితంగా పాఠశాలలు, కమ్యునిటీ హాళ్లలో క్వారెంటైన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ప్రస్తుతం కరోనా ప్రబలుతున్న తరుణంలో ప్రజలు అధిక ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని, మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. నిర్లక్ష్యం చేయవద్దన్నారు. డీడీ సప్తగిరి, మన టీవీ చానల్‌లో పాఠ్యాంశాలు ప్రసారం అవుతున్నందున పిల్లలు వాటిని చూసేలా తల్లితండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. కాగా మండలంలోని రామన్నపేటకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కొత్తకొండ శంకర్‌ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో జడ్పీ సభ్యుడు రాంమోహన్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జనగం శ్రీనివాస్‌, నూకపల్లి సహకార సంఘం అధ్యక్షుడు బోయినపల్లి మధుసూదన్‌రావు, ఎంపీటీసీ సభ్యులు పోతాని రవి,షఫియాభేగం, సర్పంచ్‌లు గడ్డం జలజ, కుమారస్వామి, కట్కూరి తిరుపతి, మండల కోఆప్షన్‌ సభ్యుడు అజహార్‌, నాయకులు కోటేశ్వరరావు, తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, గడ్డం మల్లారెడ్డి, వలీమహ్మద్‌, మోత్కు కొమురయ్య, రాజలింగం, కోరుట్ల రవి, కేతిరెడ్డి తిరుపతిరెడ్డి, జున్ను సురేంధర్‌, జోగినిపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, శాలివాహన కుల సంఘ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు. logo