సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 04, 2020 , 02:32:46

ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్‌

ఆత్మీయతకు ప్రతీక రక్షాబంధన్‌

  • n కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ అన్నదమ్ములకు రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు

కరీంనగర్‌ కల్చరల్‌: జిల్లా ప్రజలు రాఖీ పౌర్ణమిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. అన్నదమ్ముళ్లకు రాఖీలు కట్టి అక్కాచెల్లెళ్లు ఆత్మీయతను చాటుకున్నారు. కాగా, కరోనా నేపథ్యంలో చాలా చోట్ల సోదరులకు రాఖీతోపాటు మాస్కులు కట్టి శానిటైజర్లు అందజేశారు. వారి నుంచి దుస్తులు, నగదుతోపాటు శానిటైజర్లు, మాస్కులను కానుకలుగా స్వీకరించారు. ఒకరికొకరు మిఠాయి తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. అలాగే, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ఆయన సోదరీమణులు పుష్పలత, స్వర్ణలత, అరుణలత, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు గందె కల్పన రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, మేయర్‌ యాదగిరి సునీల్‌రావుకు తన సోదరితో పాటు 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ గంట కల్యాణి శ్రీనివాస్‌ రాఖీ కట్టి, స్వీటు తినిపించారు. పాతబజారులోని శివాలయంలో నిర్వహించే ’శ్రావణ నూతన యజ్ఞోపవితధారణ’ కరోనా నేపథ్యంలో నగరంలోని వేద బ్రాహ్మణోత్తములంతా తమ ఇంటి వద్దనే నిరాడంబరంగా జరుపుకున్నారు. నవకాండ రుషి పూజ, నూతన యజ్ఞోపవితధారణ పూజలు నిర్వహించారు. లోక కల్యాణార్థం ఉదయం నుంచి సాయంత్రం వరకు శివుడికి రుద్రాభిషేకం నిర్వహించినట్లు నగర వైదిక పురోహితుడు మంగళంపల్లి శ్రీనివాసశర్మ తెలిపారు. logo