శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 04, 2020 , 02:32:57

ప్రముఖులకు రాఖీలు

ప్రముఖులకు రాఖీలు

రాఖీ పండుగ సందర్భంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రము ఖులకు మహిళలు రాఖీలు కట్టి ఆప్యాయతను చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు స్థానిక వైద్య సిబ్బందితో పాటు జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాల కొండ అరుణ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని ఆయన స్వగృహంలో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ రాఖీ కట్టారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు హైదరాబాద్‌లో ఆయన సోదరి, అంతర్గాం జడ్పీటీసీ ఆముల నారాయణ భార్య విజయ నిర్మల రాఖీ కట్టారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు ఆయన సోదరీమణులు పుష్పలత, స్వర్ణలత, అరుణలత, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నా య కురాలు గందె కల్పన రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు స్థానిక క్వార్టర్స్‌ ఆవరణలో ఆయన సోదరి రా ఖీ కట్టారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డికి ఆయన సోదరి కాంతా ల అరుణ రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. - నెట్‌వర్క్‌logo