శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Aug 02, 2020 , 02:32:32

బక్రీద్‌కు పటిష్ట బందోబస్తు

బక్రీద్‌కు పటిష్ట బందోబస్తు

కరీంనగర్‌ క్రైం : కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో శనివారం బక్రీద్‌ పండుగ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు గత 15 రోజులుగా ముందస్తుగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. గోవధ, గోవుల అక్రమ రవాణా నియంత్రణకు కమిషనరేట్‌ సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు పశువుల సంతల్లో క్రయ విక్రయాలను నియంత్రించినట్లు పేర్కొన్నారు. 

కలెక్టర్‌కు కృతజ్ఞతలు

జిల్లా కలెక్టర్‌ శశాంక పూర్తిస్థాయిలో తమవంతు సహకారం అందించడంతోనే ఇది సాధ్యమైందని సీపీ అన్నారు. కమిషనరేట్‌ పోలీసుల తరఫున కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గత 15 రోజులుగా పోలీసులు రేయింబవళ్లు విధులు నిర్వహించి శాంతియుత వాతావరణంలో బక్రీద్‌ వేడుకలు జరగడంలో కీలక పాత్ర పోషించారని, అన్ని స్థాయిల పోలీసులకు శాఖాపరంగా రివార్డులు ప్రకటించారు. అలాగే రెవెన్యూ, మున్సిపల్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తమవంతు సహకారం అందించారన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు శ్రీనివాస్‌, చంద్రమోహన్‌, ఏసీపీలు అశోక్‌, విజయసారథి, శ్రీనివాస్‌, సోమనాథం, శంకర్‌రాజు, శివభాస్కర్‌, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు విజయ్‌కుమార్‌, లక్ష్మణ్‌బాబు, విజ్ఞాన్‌రావు, తుల శ్రీనివాస్‌, ఆర్‌ఐలు మల్లేశం, శేఖర్‌, వివిధ విభాగాల పోలీసులు పాల్గొన్నారు.


logo