బుధవారం 05 ఆగస్టు 2020
Karimnagar - Aug 01, 2020 , 02:31:39

ఖాజా లీలలు ఇన్నిన్నీ కాదయా..

ఖాజా లీలలు ఇన్నిన్నీ కాదయా..

  • ఆది నుంచీ అదే తీరు.. ఎక్కడ పనిచేసినా కక్కుర్తే 
  • ఇప్పటికే ఆరు నెలల పాటు సస్పెన్షన్‌
  • తాజాగా అన్నదాతల నుంచి 40 లక్షల దాకా వసూళ్లు
  • రైతుల ఆందోళనలతో మరోసారి వెలుగులోకి
  • ‘రెవెన్యూ అధికారి’పై కొనసాగుతున్న ఏసీబీ విచారణ
  • మరోసారి వేటు వేస్తూ కలెక్టర్ సందీప్‌కుమార్‌ ఝా ఉత్తర్వులు

భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే రైతుల వద్ద అందిన కాడికి దండుకుంటారని చింతలమానేపల్లి తహసీల్దార్‌ ఖాజా నియాజొద్దీన్‌పై ఆరోపణలు ఉన్నాయి. వాంకిడి తహసీల్దార్‌గా పనిచేసిన సమయంలోనూ లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో తన కింద పని చేసే ఓ వీఆర్వో దగ్గర లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి ఆరు నెలల పాటు సస్పెండ్‌  అయ్యాడు. ఎనిమిది నెలల క్రితం చింతలమానేపల్లి తహసీల్దార్‌ గా బాధ్యతలు తీసుకున్నాడు. ఇక్కడ డ్యూటీలో చేరినప్పటి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నాడన్న ట్లు తెలుస్తుంది. విరాసత్‌లు, పట్టాల్లో పేరు మా ర్పు వంటి వాటి కోసం రైతుల వద్ద రూ. లక్షల్లో వసూలు చేసినట్లు సమాచారం.

తాజాగా వెలుగులోకి..

చింతలమానేపల్లి మండలంలోని సుమారు 26 గ్రామాలకు చెందిన 100 మంది రైతులకు పట్టాలు ఇప్పిస్తానని తహసీల్దార్‌ ఖాజానియాజొద్దీన్‌ లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. భూ సమస్యను బట్టి ఒక్కొక్కరి వద్ద రూ. 10 వేలు మొదలుకొని.. రూ. లక్షా 70 వేల దాకా తీసుకున్నాడు. సాక్షాత్తూ తహసీల్దారే పట్టాలు ఇప్పిస్తానని చెప్పడంతో రైతులందరూ నమ్మి రూ. 30 నుంచి రూ. 40 లక్షల వరకు ముట్టజెప్పిన్ల సమా చారం.  ఈ క్రమంలో ఈ నెల 27న తహసీల్దార్‌ ఖాజానియాజొద్దీన్‌ను కలెక్టరేట్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న రైతులు గురువారం తహసీల్దార్‌ కార్యాలయానికి తరలివచ్చి ఆందోళనకు దిగడంతో అసలు విష యం బయటపడింది.

తహసీల్దార్‌ సస్పెన్షన్‌

తహసీల్దార్‌ ఖాజా నియాజొద్దీన్‌ అక్రమాలపై శుక్రవారం ఏసీబీ అధికారులు విచారణ చేపట్టా రు. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య, సీఐలు ప్రశాం త్‌, వేణుగోపాల్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి రైతుల నుంచి వివరాలు సేకరించారు. ఒక్కో రైతు వద్ద ఎన్ని డబ్బులు తీసుకున్నాడు, ఏయే సమస్యలపై డబ్బులు తీసుకున్నాడు.. అనే అంశాలపై వివరాలు సేకరించారు. తాను ఏ రైతు వద్ద ఎంత తీసుకున్నాడో తహసీల్దార్‌ అధికారులకు తెలిపాడు. దీనిపై లిస్ట్‌ కూడా తయారు చేసి ఏసీబీ అధికారులకు ఇవ్వడం గమనార్హం. తహసీల్దార్‌కు డబ్బులు ఇచ్చిన రైతుల అందరినీ విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏసీబీ డీఎస్పీ భద్ర య్య తెలిపారు. శుక్రవారం సుమారు 15 మంది రైతుల నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్‌ సందీప్‌కుమా ర్‌ ఝా స్పందిస్తూ ఖాజా నియాజొద్దీన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


logo