సోమవారం 28 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 31, 2020 , 01:35:47

నూతన విద్యా విధానం శుభ పరిణామం

నూతన విద్యా విధానం శుభ పరిణామం

  •  n అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత   డా. వీ నరేందర్‌రెడ్డి

కొత్తపల్లి: ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో నూతన విద్యా విధానం ప్రవేశపెట్టడం శుభ పరిణామమని, ఇది విద్యాభివృద్ధికి దిక్సూచి లాంటిదని అల్ఫోర్స్‌ విద్యా సంస్థల అధినేత డా. వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వావిలాలపల్లిలోని అల్ఫోర్స్‌ ఈ-టెక్నో కళాశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా దేశంలో విద్యా విధానంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదన్నారు. పిల్లలకు ప్రాథమిక దశ నుంచే నాణ్యమైన, విలువలతో కూడిన విద్యనందించాలనే ఉద్దేశంతో ఈ విధానం రూపొందించినట్లు పేర్కొన్నారు. మొదటి ఐదు సంవత్సరాలు విద్యార్థులకు మాతృభాషలోనే విద్యా బోధన చేయడం  ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇంటర్‌ విద్యను రద్దు చేసి, పాఠశాల స్థాయిలోనే అందించాలని అనుకోవడం గొప్ప నిర్ణయమన్నారు. ఈ విద్యా విధానాన్ని మన దేశంలో ఇప్పటికే సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఇంటర్‌ కళాశాలల్లో 9, 10 తరగతులు నిర్వహించుకోవడానికి, 9, పదో తరగతి వరకు కొనసాగుతున్న పాఠశాలల్లో 11, 12 తరగతులు నిర్వహించడానికి అనుమతివ్వాలని కోరారు. 



logo