ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 30, 2020 , 02:11:30

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

 నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

  • మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ

చొప్పదండి: హరితహారంలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేస్తున్న ప్రతి మొక్కనూ బాధ్యతగా నాటి సంరక్షించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ పిలుపు నిచ్చారు. పట్టణంలోని 10వ వార్డులో కౌన్సిలర్‌ కొత్తూరి స్వతంత్రభారతి ఆధ్వర్యంలో బుధవారం ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి సంరక్షిస్తూ, హరిత నగరంగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రస్తుతం నాటుతున్న మొక్కలు భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడుతాయన్నారు. ఇంటి ఆవరణలో నాటేందుకు వీలుగా పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.  బొడిగె లలిత, శ్రీనివాస్‌, వడ్లకొండ శ్రీనివాస్‌, కొండిళ్ల శంకర్‌, మాచర్ల అజయ్‌, బొడిగె అనిల్‌, గోలిపల్లి కార్తీక్‌, తదితరులు పాల్గొన్నారు.logo