శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 30, 2020 , 02:11:48

lదళిత జనాభా అధికంగా ఉన్న పల్లెల అభివృద్ధికి కేంద్రం చర్యలు

lదళిత జనాభా అధికంగా ఉన్న  పల్లెల అభివృద్ధికి కేంద్రం చర్యలు

  • lగతేడాది ఉమ్మడి జిల్లాలో  16 గ్రామాల ఎంపిక
  • lప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల ఆదేశాలు

జగిత్యాల: ఎస్సీ జనాభా అధికంగా ఉన్న గ్రా మాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. పీఎంజీవై(ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామీణ యోజన) పథకాన్ని రూపొందించి, పనులు చేపడుతున్నది. 2010లో పైలట్‌ ప్రాజెక్టుగా ఆరు రాష్ర్టాల్లో అమలు చేసి సత్ఫలితాలు సాధించగా, గతేడాది మన రాష్ట్రంలో అమలు చే యాలని భావించి, 27 జిల్లాలోని 137 గ్రామాలను ఎంపిక చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లాలో 50శాతం కంటే ఎక్కువ మంది దళితులున్న గ్రా మాలు 16 గ్రామాలు ఎంపికయ్యాయి.  

ఒక్కో జీపీకి రూ.20 లక్షలు వచ్చే అవకాశం.. 

ఉమ్మడి జిల్లాలో 16గ్రామాలు ఎంపికయ్యా యి. జగిత్యాల జిల్లాలో 6, కరీంనగర్‌లో 2, పెద్దపల్లిలో ఆరు, సిరిసిల్లలో 2 గ్రామాలున్నాయి. బీ ర్పూర్‌ మండలం కమ్మూనూర్‌, జగిత్యాల మం డలం తిమ్మాపూర్‌, వెల్గటూర్‌ మం డలం సంకెనపల్లి, పడ్కల్‌, అంబారిపేట, కప్పరావుపేట గ్రామాలను ఎంపిక చేశారు. ఈ పథకం కింద మౌళిక వసతులు, రహదారులు, అంగన్‌వాడీ, నీటి సరఫరా, గృహ నిర్మా ణం, విద్యుద్దీకరణ, సర్వశిక్షా అభియాన్‌, జాతీ య ఉపాధిహామీ చట్టం, ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌, పారిశుద్ధ్య అమలు తీరు, మరుగుదొడ్ల నిర్మాణాలు, వినియోగం, గ్రామం లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, అంటరానిత నం అనే అంశాలపై సర్వే చేయాల్సి ఉంటుంది. మహిళలు, చిన్నపిల్లల అక్రమ రవాణా ఉందా? అనే అంశాలపై తయారు చేసిన నివేదికను ఆన్‌లైన్‌ ద్వారా ఉన్నతాధికారులు అందిస్తే ఆ గ్రామా ల స్థితిగతుల ఆధారంగా ఒక్కో జీపీకి రూ.20    లక్షల నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. 

రంగంలోకి యంత్రాంగం.. 

ప్రస్తుతం పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నుంచి వచ్చిన ఆదేశాలతో ఆయా జిల్లాల్లో అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లో వివరాల సేకరణ ప్రారంభించారు. వయస్సుల వారీగా జనాభా వివరాలు, వ్యవసాయ భూమి, నిరుపయోగంగా ఉన్న భూ మి, నిరుద్యోగ యువత, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఎంత మంది ఉన్నారు. బ్యాంకు ఖాతాలు, మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సౌకర్యం, తదితర వివరాలు సేకరిస్తున్నారు. వీటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. తర్వాత గ్రామాల పరిస్థితుల ఆధారంగా నిధులు మంజూరు కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 

కార్యాచరణ రూపొందిస్తున్నాం

ఉన్నతాధికారుల నుంచి వచ్చిన  ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో వివరాలు సేకరిస్తు న్నాం. గ్రామాల్లో మౌళిక వసతులు కల్పించేందుకు పూర్తిస్థాయిలో యాక్షన్‌ ప్లాన్‌ను తయారు చేసి, ఉన్నతాధికారులకు అందజేస్తాం. వాటి ఆధారంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది.

- వీ శేఖర్‌, జిల్లా పంచాయతీ అధికారి, (జగిత్యాల)


logo