శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 29, 2020 , 01:09:57

మొక్కల రక్షణతోనే పర్యావరణ పరిరక్షణ

మొక్కల రక్షణతోనే పర్యావరణ పరిరక్షణ

గంగాధర: మొక్కల సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని కలెక్టర్‌ శశాంక పేర్కొన్నారు. మొక్కలు ఎండిపోకుండా పంచాయతీ పాలకవర్గాలు దృష్టి పెట్టాలని సూచించారు. హరితహారం లో భాగంగా మండలకేంద్రంలోని ప్రకృతి వనం లో మొక్కలు నాటారు. కురిక్యాల పంచాయతీ పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొమ్మలమ్మగుట్ట వద్ద ప్రభుత్వ భూమిలో మంకీఫుడ్‌ కోర్డు, బ్లాక్‌ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. గ్రామాల్లో మంకీఫుడ్‌ కోర్టు, ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు నాటడంతో పాటు పశువులు మే యకుండా రక్షణ చర్యలు తసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, ఏపీడీ మంజులాదేవి, తహసీల్దార్‌ జయంత్‌, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, ఏపీవో రాణి, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్‌, మేచినేని నవీన్‌రావు, వేము ల దామోదర్‌, ఎంపీటీసీ మడుపు లింగారెడ్డి, నేత లు రేండ్ల శ్రీనివాస్‌, వేముల అంజి పాల్గొన్నారు. 

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: రైతువేదిక, కల్లాలు, ప్రకృతి వనాలు, హరితహారం, డంప్‌యార్డు తదితర అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌తో కలిసి గంగాధర, చిగురుమామిడి, సైదాపూర్‌, రుక్మాపూర్‌ మండలాల నోడల్‌ ఆఫీసర్లు, పీఆర్‌ఈఈ, ఏఈలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  రైతు వేదికల కోసం అన్ని క్లస్టర్లలో స్థలాలను గుర్తించాలన్నారు. ఉపాధి హామీ నిధులతో పనులు చేపట్టాలని సూచించారు. మండలానికో కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించి  సెప్టెంబర్‌లోగా పూర్తి చేయించాలన్నారు. డంప్‌ యా ర్డులు, వైకుంఠథామాల పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌ను వెంటనే పూర్తి చేయాలని నిర్దేశించారు.    కరెంట్‌ కనెక్షన్‌ తీసుకోవాలని, రైతు వేదికలు నిర్మించేటపుడు బోర్‌వెల్స్‌తో పాటు ట్యాంకులను ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించాలన్నారు. రైతు వేదికలు, రైతు కల్లా లు 40 రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. ఈ  సమావేశంలో  జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్‌, జిల్లా రెవె న్యూ అధికారి వెంకటమాధవరావు, పీఆర్‌ ఎస్‌ఈ విష్ణువర్ధన్‌, సెరీకల్చర్‌, వ్యవ సాయాధికారు లు శ్రీనివాస్‌,  శ్రీధర్‌ పాల్గొన్నారు. 

 పనుల్లో జాప్యం వద్దు..

రైతు వేదికలు, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌  పనుల్లో జాప్యం చేయవద్దని  కలెక్టర్‌ శశాంక అన్నారు. మంగళవారం జిల్లాలోని  ఎంపీడీవోలు, జిల్లా వ్యవసాయాధికారి, పీఆర్‌ఈఈ  లు, తహసీల్దార్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలైన హరితహారం, రై తు వేదిక, పల్లె ప్రగతి వనాలు, రైతు కల్లాల పనుల ను త్వరగా పూర్తి చేయాలన్నారు. పల్లె ప్రగతిలో భా గంగా శ్మశాన వాటికల నిర్మాణాలు, డంప్‌యార్డుల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణ పనులపై  ఎం పీడీవోలు దృష్టి సారించాలని సూచించారు. అన్ని మండలాలు, గ్రామాల్లో మంకీపుడ్‌కోర్టు, మియావా కీ పద్ధతిలో వనాలను  పెంచాలన్నారు.  రోడ్లకిరువైపులా అవెన్యూ, బ్లాక్‌ ప్లాంటేషన్‌ యాదాద్రి తరహాలో ఉండే విధంగా చూడాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రణాళికాబద్ధ్దంగా మురుగునీటి కాలువల్లో పూడికతీత, రోడ్లు ఊడ్చివేత, చెత్తను ప్రతిరోజు డంప్‌యార్డుకు పంపించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాఖల వారీగా గ్రామాలు, మండలాల వారీగా హరితహారం లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.  


logo