బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 29, 2020 , 00:44:12

సాహితీ శిఖరం సినారె

సాహితీ శిఖరం సినారె

సాహితీ శిఖరం సినారె. మారుమూల పల్లె నుంచి మహోన్నత స్థాయికి ఎదిగిన మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఎల్లలు దాటిన రచనలతో ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఆయన, 1931 జూలై 29న జన్మించారు. తెలుగు సాహిత్యంలో పీజీ చేసి, ఉస్మానియా నుంచి డాక్టరేట్‌ను కూడా పొందారు. చిన్న నాటి నుంచే హరికథలు, జానపదాలు, జంగం కథల వైపు ఆకర్షితుడై సాహితీ రంగంలోకి అడుగు పెట్టి, అంచలంచెలుగా ఎదిగారు. వివిధ ఉద్యోగాల్లో రాణిస్తూనే, కవిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. అనేక కవితలు, పద్య, గేయ, ముక్త కావ్యాలు, గత్య కృతులు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపాలు, బుర్రకథలు, వ్యాసాలు, విమర్శనా గ్రంథాలు, నాటాకాలు, అనువాదాలే కాకుండా వేలాది సినీగీతాలను రాశారు. మరుగున పడిన గజళ్లను కొత్త ప్రక్రియలో తిరిగి అందించారు. ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం, మొదలైన భాషల్లోకి రచనలను అనువదించారు. హిందీ, ఉర్దూ భాషల్లో కూడా స్వయంగా కవితలు అల్లారు. తనకంటూ గుర్తింపు సాధించి, ఎన్నో పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు.logo