గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Jul 26, 2020 , 02:02:01

రూట్‌ మ్యాప్‌ అందజేత

రూట్‌ మ్యాప్‌ అందజేత

  •  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ను కలిసిన ప్రజాప్రతినిధులు

కథలాపూర్‌/మేడిపల్లి : కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లోని చెరువులకు వరదకాలువ నుంచి నీటిని లిఫ్ట్‌ల ద్వారా అందించే రూట్‌ మ్యాప్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు శనివారం జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నా యకులు అందజేశారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి వరదకాలువకు ఎక్కడెక్కడ లిఫ్ట్‌లు ఏర్పాటు చేసే అవకాశముందో వివరించారు. వరదకాలువ ద్వారా ఆయా గ్రా మాల చెరువులను నీటితో నింపేందుకు ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి 40 గ్రామాలను సందర్శించి సర్వే నిర్వహించిన తీరును, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను వివరించారు. వినోద్‌కుమార్‌ను కలిసిన వారిలో మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, జగిత్యాల జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు, కథలాపూర్‌ జడ్పీటీసీ నాగం భూమ య్య, రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ కాటిపెల్లి శ్రీపాల్‌రెడ్డి, మల్యాల జడ్పీటీసీ సభ్యుడు రామ్మోహన్‌రావు, రిటైర్డ్‌ ఎస్‌ఈ గోవింద్‌రావు ఉన్నారు.


logo