శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 26, 2020 , 02:02:03

పొలం ఒడ్డున.. రైతన్న చెంతన.. సర్కారు సాగు ముచ్చట..

పొలం ఒడ్డున.. రైతన్న చెంతన..  సర్కారు సాగు ముచ్చట..

నాడు సీజన్‌లో రైతన్న ఏదైనా సమస్యతో అధికారులను కలువాలంటే రోజంతా పోయేది. వ్యయప్రయాసల కోర్చి ఆఫీసుకు పోయినా, ‘రేపు రా.. మాపురా..’ అనే సమాధానమే వచ్చేది. ఇది సమైక్య రాష్ట్రంలో కర్షకుల దుస్థితి. కానీ, స్వరాష్ట్రంలో సీన్‌ మారింది. టీఆర్‌ఎస్‌ సర్కారు తెచ్చిన సంస్కరణలతో అధికారులే కాదు.. రాజ్యమంతా అన్నదాత చుట్టే తిరుగుతున్నది. అందుకు నిదర్శనమే ఈ చిత్రం! రాష్ట్ర ప్రభుత్వం పంటల సర్వే చేపట్టగా యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నది. నర్మాలలో రైతు ఆకునూరి శ్రీనివాస్‌ వద్దకు వెళ్లిన ఏఈవో ప్రవీణ్‌, అక్కడే పొలం ఒడ్డుపై ఇలా కూర్చొని వివరాలు సేకరించడం చేరువైన పాలనకు అద్దం పడుతున్నది. - గంభీరావుపేట logo