బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 26, 2020 , 02:02:04

15లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

15లోగా అభివృద్ధి పనులు  పూర్తి చేయాలి

కార్పొరేషన్‌: నగరంలోని సర్కస్‌గ్రౌండ్‌లో స్మార్ట్‌సిటీ కింద చేపడుతున్న అభివృద్ధి పనులను ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. నగరంలోని సర్కస్‌గ్రౌండ్‌లో చేపడుతున్న అభివృద్ధి పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రౌండ్‌లో నిర్మిస్తున్న వాకింగ్‌ ట్రాక్స్‌, టాయిలెట్‌ బ్లాక్స్‌, స్కైవాక్‌, వాటర్‌ బాడీ యోగశాల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. మల్టీపర్పస్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో ఆంఫీథియేటర్‌, గజిబో, ప్లేగ్రౌండ్‌ పనులను పూర్తి చేయాలన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆర్వీ కన్సల్టెన్సీని ఆదేశించారు. 

వైకుంఠధామం పనులు పరిశీలన 

కార్పొరేషన్‌: నగరంలోని మానేరు వాగు సమీపంలో స్మార్ట్‌సిటీ కింద చేపడుతున్న వైకుంఠధామం నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక అధికారులను ఆదేశించారు. వైకుంఠధామం పనులను, స్మార్ట్‌సిటీ కింద హౌసింగ్‌బోర్డు, తదితర ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హౌసింగ్‌బోర్డు కాలనీలో మినీ స్టేడియం అన్ని సౌకర్యాలతో చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు వాల రమణారావు, బండారి వేణు, ఆకుల పద్మ, ప్రకాశ్‌, నగరపాలక అధికారులు, ఆర్వీ కన్సల్టెన్సీ ప్రతినిధులు జగదీష్‌, మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 


logo