ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 25, 2020 , 02:52:37

కేకు కోసి.. మొక్కలు నాటి

కేకు కోసి.. మొక్కలు నాటి

హుజూరాబాద్‌/హుజూరాబాద్‌ రూరల్‌: టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను శుక్రవారం ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ సమీపంలోని బోర్నపల్లిలో టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు దొంత రమేశ్‌  ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. స్వీట్లు పంచారు. మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రమేశ్‌ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్ష వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతుల సంజీవ్‌, సంపంగి రాజేందర్‌, సందమల్ల బాబు, బత్తిని రవీందర్‌, దుబాసి బాబు, మోరె మధు, జంగ అనిల్‌, ముక్క శ్రీనివాస్‌, వంతడ్పుల అరవింద్‌, నాగరాజు, అజయ్‌, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. తుమ్మనపల్లి, చెల్పూర్‌ తదితర గ్రామాల్లో మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకల్లో భాగంగా కేక్‌ కట్‌ చేశారు. స్వీట్లు పంచారు. మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హుజూరాబాద్‌ టౌన్‌: మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద మొక్కలు నాటారు. కేక్‌ కట్‌ చేశారు. స్వీట్లు పంచారు. తెలంగాణటోపి రాంబాబు మండల పరిషత్‌ ఎదుట పది మొక్కలు నాటి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కేటీఆర్‌ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హుజూరాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కన్నెబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు చందాగాంధీ, చొల్లేటి రాజన్న, పంజాల సుధాకర్‌గౌడ్‌, నాగరాజుగౌడ్‌, రాకేశ్‌, కాసగోని శ్రీనివాస్‌గౌడ్‌, బూసారపు బాబురావు, భాస్కర్‌, సదానందం, బీఆర్‌గౌడ్‌, ఏ అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట: మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను పట్టణంతో పాటు, మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్‌ యార్డు ఆవరణలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పొనగంటి శారద మల్లయ్య ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం ఏర్పాటు చేయగా, దీనికి జడ్పీటీసీ డాక్టర్‌ శ్రీరాం శ్యాం, టీఆర్‌ఎస్‌ అర్బన్‌శాఖ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్‌ హాజరయ్యారు. మొక్కలు నాటారు. మున్సిపల్‌ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాథాశ్రమంలో టీఆర్‌ఎస్వీ సీనియర్‌ నాయకుడు ఆలేటి శ్రీరాం ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేశారు. విద్యార్థులకు కేక్‌, పండ్లు అందించారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo