శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 24, 2020 , 03:27:52

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

మానకొండూర్‌ రూరల్‌: గ్రామాల్లో  డంప్‌యా ర్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ కరీంనగర్‌ జడ్పీ సీఈవో వెంకటమాధవరావు సూచించారు. గురువారం  మండల పరి ధిలోని లక్ష్మీపూ ర్‌, పచ్చునూర్‌ గ్రామాల్లో డంప్‌యార్డు స్థలాలను  తహసీల్దార్‌ రాజయ్యతో కలిసి పరిశీలించారు. అన్నారంలో శానిటేషన్‌ పనులను పరిశీలించారు.  వన్నారం, శంషాబాద్‌లో ఎంపీడీవో భాస్కర్‌రావు పర్యటించి హరితహారంలో భా గంగా చేపట్టిన ప్రకృతి వనం పనులను పర్యవేక్షించారు.  ఈదులగట్టెపల్లిలో సోషల్‌ ఆడిట్‌ బృందం నల్లగట్టు ప్రాంతంలో ఉపాధి హామీలో చేసిన పనులు, రికార్డుల వారీగా పరిశీలించారు. సర్పం చులు, వార్డుసభ్యులు, నాయకులు పాల్గొన్నారు.   

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

తిమ్మాపూర్‌: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి ఖదీర్‌ అహ్మద్‌ అధికారులకు సూచించారు.  గురువారం  తిమ్మాపూర్‌, నుస్తులాపూర్‌, పర్లపల్లి గ్రామాల్లో  కొనసాగుతున్న రైతు వేదిక, పల్లె ప్రకృ తి వనాలు, శ్మశానవాటిక, తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. హరితహారంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలని కోరారు. కా ర్యక్రమంలో ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, పీఆర్‌ ఏఈ సురేందర్‌రెడ్డి, ఎంపీవో కిరణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజయ్య యాదవ్‌, సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు ఉన్నారు.


logo