బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 23, 2020 , 02:40:25

పుట్టిన రోజు.. సామాజిక సేవ

పుట్టిన రోజు.. సామాజిక సేవ

నగరంలో బుధవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలను ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. హరితహారంతో పాటు రక్తదాన శిబిరాలు,  తదితర సేవా కార్యక్రమాలు చేపట్టారు. 

 కార్పొరేషన్‌: నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో గల వీరబ్రహ్మేంద్రస్వామి అనాథ వృద్ధాశ్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా మేయర్‌ వై సునీల్‌రావు ఆధ్వర్యంలో 35 మంది వృద్ధులకు నెలకు సరిపడా బియ్యం, 15 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ కరీంనగర్‌ అభివృద్ధికి బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నాయకులు అంజన్‌రావు, తదితరులున్నారు. అలాగే, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌ ఆధ్వర్యంలో డివిజన్‌ మీ సేవా కార్యాలయంలో 20 మంది  పేద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మేయర్‌ వై సునీల్‌రావు చేతుల మీదుగా 25 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఇక్కడ కార్పొరేటర్‌ బండారి వేణు, టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ పొన్నం అనిల్‌కుమార్‌ గౌడ్‌, నాయకులు శ్రీకాంత్‌, రాజు తదితరులున్నారు. స్థానిక కరీముల్లా దర్గాలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ నాయకులు బాబా, సయ్యద్‌ అఫ్జల్‌ హుస్సేన్‌, తదితరులున్నారు. రేకుర్తిలో టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో 100కు పైగా మొక్కలు నాటి, ట్రీగార్డులు ఏర్పాటు చేశారు. టీఆర్‌ఎస్వీ నాయకులు రాజేశ్‌, అనిల్‌, తదితరులు పాల్గొన్నారు. 3వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కంసాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేశారు. కాలనీవాసులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు. 
కొత్తపల్లి: బంగారు తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. వినోద్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆయన మొక్కలు నాటి, మాట్లాడారు. కొత్తపల్లి మండలం  చింతకుంట హైస్కూల్‌ మైదానంలో ఎంపీటీసీ, సుడా డైరెక్టర్‌ భూక్యా తిరుపతినాయక్‌ మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్వీ కరీంనగర్‌ అసెంబ్లీ అధ్యక్షుడు కిమ్‌ ఫహాద్‌, సాయి, నవీన్‌రెడ్డి, సందమల్ల రవితేజ వర్మ, సుదర్శన్‌, వెంకట్‌రెడ్డి, గ్రంథాలయ సిబ్బంది, చింతకుంట మాజీ సర్పంచ్‌ పిట్టల రవీందర్‌, మాజీ ఉప సర్పంచ్‌ లక్ష్మీనారాయణ, మైనార్టీ విభాగం మండలాధ్యక్షుడు సయ్యద్‌ చాంద్‌పాషా, టీఆర్‌ఎస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు మల్లేశం, లక్ష్మి, రాజమ్మ పాల్గొన్నారు. 
కొత్తపల్లి: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను బుధవారం టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కొలిపాక మల్లికార్జున్‌ హైదరాబాద్‌లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
కరీంనగర్‌ లీగల్‌:  జిల్లా కోర్టులో కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పీవీ రాజ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు ఆరెల్లి రాములు, ప్రధాన కార్యదర్శి లెంకల రాంరెడ్డి, సీనియర్‌ ఈసీ సభ్యుడు పెంచాల ప్రభాకర్‌రావు, అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ గౌరు రాజిరెడ్డి కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవకుడిగా, కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ ప్రదాతగా, ప్రజాబంధువుగా ప్రజల గుండెల్లో బోయినపల్లి వినోద్‌కుమార్‌ నిలిచారని కొనియాడారు. 
కరీంనగర్‌ రూరల్‌: ఆరెపల్లిలోని దర్గాలో మైనార్టీ నాయకులు సయ్యద్‌ నయీం బాయ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు మజీద్‌, ఇమ్రాన్‌షేక్‌, ఉమర్‌, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్‌: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణచౌక్‌, మంకమ్మతోట, జ్యోతినగర్‌లో మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం వినోద్‌కుమార్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు జీఎస్‌ ఆనంద్‌, కొలిపాక శ్రీనివాస్‌, సతీశ్‌, అక్బర్‌, యుగంధర్‌, సురేందర్‌, మనోజ్‌ పాల్గొన్నారు.  


logo