సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 19, 2020 , 03:19:33

‘రైల్వే ప్రైవేటీకరణతో ప్రజలకు తీవ్ర నష్టం’

‘రైల్వే  ప్రైవేటీకరణతో ప్రజలకు తీవ్ర నష్టం’

కరీంనగర్‌ రూరల్‌: రైల్వేల ప్రైవేటీకరణతో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మయ్య పేర్కొన్నారు. రైల్వే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం ఏఐటీయూసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్టేషన్‌ డిప్యూటీ మేనేజర్‌కు వినతిపత్రం అందించారు. బ్రిటిష్‌ పాలనలో కూడా రైల్వే శాఖ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేదని, తెలంగాణలో నిజాం ప్రభుత్వ ఆధీనంలో రైల్వేలు నడిచాయని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రైల్వే సంస్థ పూర్తిగా ప్రభుత్వ పరమైన తర్వాత రైల్వే శాఖను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అభివృద్ధిలో ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, ఇంజినీర్లు, అధికారుల పాత్ర ఎంతో ఉందన్నారు. నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 150 రూట్లను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ  ప్రైవేటీకరిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని విమర్శించారు. ఉపాధి కల్పన చేయకుండా ఉన్న సంస్థలను మూసి వేయాలనే  కుట్ర సరికాదని, వెంటనే రైల్వేల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు లక్ష్మయ్య, అధ్యక్షుడు బుచ్చన్నయాదవ్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెడిపల్లి రాజు, కాశెట్టి లక్ష్మయ్య, దాసరి ప్రభాకర్‌, బండారి రమేశ్‌, కొడారి శంకర్‌, తిరుపతి, రమేశ్‌, రవి, రైల్వే హమాలీ సంఘం నాయకులు, సభ్యులు  పాల్గొన్నారు. 


logo