శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 19, 2020 , 03:09:43

‘భగీరథ’ పనులు పూర్తి చేయాలి

‘భగీరథ’ పనులు పూర్తి చేయాలి

కార్పొరేషన్‌ : కరీంనగర్‌లో మిషన్‌ భగీరథ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని బీసీ సంక్షే మ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. అర్బన్‌ ఏరియా మిషన్‌ భగీరథ నీటి సరఫరాపై మున్సిపల్‌, వాటర్‌ గ్రిడ్‌, పబ్లిక్‌ హెల్త్‌, ఎల్‌అండ్‌టీ ఇంజినీరింగ్‌ అధికారులతో కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశమందిరంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి గంగుల హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్‌ భగీరథ నీటి సరఫరా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రోజూ తాగునీరు సరఫరా చేయాలని, వాటర్‌గ్రిడ్‌, మున్సిపల్‌, మిషన్‌ భగీరథ ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో పని చేయాలని, అలాగే ప్రెషర్‌ తక్కువగా ఉన్న పైపులైన్లను సరి చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న పైపులైన్లకు ఇంటర్‌ కనెక్షన్లతో పాటు, ప్రతి ఇంటికి భగీరథ కనెక్షన్లు ఇవ్వాలని ఆ దేశించారు. వాటర్‌ ట్యాంకుల్లో రోజూ నీరు నిండుగా ఉండేలా చూడాలని, వాటిని శుభ్రంగా ఉం చడంతో పాటు నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. హ్యాండ్‌ పంపులను  రిపేర్లు లేకుండా చూసుకోవాలని, మున్సిపల్‌ కా ర్పొరేషన్‌ అధికారులు అవసరమైన మెటీరియల్‌ను అందుబాటులో ఉండేలా చూడాలని సూ చించారు. టీంలను ఏర్పాటు చేసుకుని పైపులైన్లు లీకేజీ కాకుండా చూడాలని, మేజర్‌, మైనర్‌ రిపేర్లను ఎప్పటికప్పుడు చేయాలని ఆదేశించారు.

స్మార్ట్‌ సిటీ ..

కరీంనగర్‌ మానేరు డ్యాం చుట్టు పక్కల స్మృతి వనం, ట్రెంచ్‌-1, 2, 3లో 23 ఎకరాల్లో అన్ని వసతులు, సౌకర్యాలు ఉండేలా పనులు చేయాలని ఆదేశించారు. స్మార్ట్‌ సిటీ పనులపై మున్సిపల్‌ అధికారులు, కార్తీక టీం, ఇంజినీరింగ్‌ అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా పెండింగ్‌ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి, నీటి నిలువలు లేకుండా చూడాలని మంత్రి సూచించారు. సమావేశంలో కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక, మేయర్‌ సునీల్‌రావు, అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్‌, కరీంనగర్‌ బల్దియా కమిషనర్‌ క్రాంతి, ఉప్పలయ్య, మిషన్‌ భగీరథ, వాటర్‌గ్రిడ్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


logo