ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 17, 2020 , 02:06:14

ట్రాక్టరొచ్చింది.. పల్లె మెరిసింది

ట్రాక్టరొచ్చింది.. పల్లె మెరిసింది

  •   తొలగిన పారిశుద్ధ్య సమస్యలు
  •   ఫలితాన్నిస్తున్న ట్రాక్టర్ల పంపిణీ

ఓదెల: పల్లె ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి పంపిణీ చేసిన ట్రాక్టర్లతో పారిశుద్ధ్యం మెరుగుపడుతున్నది. పల్లెల్లో పరిశుభ్రత నెలకొంటున్నది. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణే కీలకంగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం జీపీకో ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాక్టర్‌తోపాటు ట్రాలీ, ట్యాంకర్‌ను సమకూర్చింది. వీటిద్వారా గ్రామాల్లో చెత్తాచెదారాన్ని తొలగించడంతోపాటు హరితహారంలో నాటిన మొక్కలకు ప్రతిరోజు నీళ్లు పడుతున్నారు. 

నిత్యం చెత్త సేకరణ

జీపీ ట్రాక్టర్‌తో సిబ్బంది ప్రతి రోజు గ్రామంలోని వాడవాడలా తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నారు. మున్సిపాలిటీలను తలపించే విధంగా గ్రామపంచాయతీ సిబ్బంది విజిల్‌ వేస్తూ గ్రామంలో తిరుగుతుండడంతో ప్రజలు ఇండ్లలోని చెత్తాచెదారాన్ని అందులో వేస్తున్నారు. రోడ్లు శుభ్రంగా కనిపిస్తున్నాయి. సేకరించిన చెత్తను డంప్‌ యార్డులకు తరలిస్తున్నారు. అలాగే వేసవి కాలంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ ట్యాంకర్‌తో హరితహారంలో నాటిన మొక్కలకు నీళ్లు పోశారు. పల్లె ప్రగతి  కార్యక్రమాల ద్వారా పల్లెలన్నీ పరిశుభ్రమవడమే గాక, గ్రామాల్లో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది.

ట్రాక్టర్లు చాలా ఉపయోగపడుతున్నయ్‌..

గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు ఉండాలనే సీఎం సారు నిర్ణయం చాలా గొప్పది. ట్రాక్టర్లతో గ్రామాల్లో పరిశుభ్రత నెలకొంటున్నది. వీటికి తోడు గ్రామపంచాయతీ సిబ్బందికి జీతం కూడా పెంచడంతో వారు ఉత్సహంగా పని చేస్తున్నరు. ఇంటింటికీ జీపీ ఆధ్వర్యంలో తడి, పొడి చెత్తబుట్టలను అందించాం. అందులో వేసిన చెత్తను ప్రజలు ట్రాక్టర్లు తమ ఇంటిముందుకు వచ్చినప్పుడు డబ్బాలో వేస్తున్నరు. 

- సామ మణెమ్మ, సర్పంచ్‌, కొలనూర్‌logo