మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 16, 2020 , 02:38:03

కేసుల విచారణకు మొబైల్‌ వర్చువల్‌ కోర్టు

కేసుల విచారణకు మొబైల్‌ వర్చువల్‌ కోర్టు

కరీంనగర్‌ లీగల్‌: కరోనా కారణంగా కోర్టులు మూ తపడ్డాయి. అత్యవసర కేసులను మాత్రం ఆన్‌లై న్‌లో విచారిస్తున్నారు. కాగా ఆన్‌లైన్‌ ద్వారా కేసు ల దాఖలుకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఉన్న వా రికి అవకాశం ఉందని, సామాన్యులు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని న్యాయవాద సంఘా లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన హైకోర్టు ఇలాంటి న్యాయవాదుల సౌకర్యార్థం కోర్టు పరిసర ప్రాంతాల్లో మొబైల్‌ వర్చువల్‌ కోర్టు వాహనాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ సహకారంతో ఈ మొబైల్‌ వర్చువల్‌  కోర్టును అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. ఈ వాహనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి  అనుపమ చక్రవర్తి  బుధ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఈ వాహనంలో ఇంటర్నెట్‌ సౌ కర్యం కల్పించామని,  దీనిని జిల్లా కోర్టు భవనం ముందు గురువారం ఉదయం నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కేసుల విచారణ, పిటిషన్ల దాఖలు, కక్షిదారులను ప్రవేశపెట్టడం తది తర కార్యకలాపాలకు ఈ వాహనం ఉపయోగప డుతుందన్నారు. న్యాయవాదులు వినియోగించు కోవాలని సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పా టించాలని  కోరారు. కాగా  రాష్ట్రంలో మొదట వరంగల్‌లో వర్చువల్‌ కోర్టు ఏర్పాటు చేయగా, కరీంనగర్‌లో రెండో మొబైల్‌ వర్చువల్‌ వాహ నాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ కార్యక్ర మంలో పలువురు న్యాయవాదులు ఉన్నారు.


logo