సోమవారం 28 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 15, 2020 , 02:26:09

ప్రతి చెరువునూ నింపుతాం

ప్రతి చెరువునూ నింపుతాం

  •  మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

ఇల్లంతకుంట: మండలంలోని ప్రతి చెరువునూ కాళేశ్వరం జలాలతో నింపి ఆఖరు భూములకు సైతం నీరందిస్తామని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. మంగళవారం ఇల్లంతకుంట, మారంపేట, పెద్దలింగాపూర్‌, దాచారం గ్రామాల్లో రైతు వేదికలు, అనంతారంలో కూరగాయల సంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలోనే ఇల్లంతకుంట మండలం సస్యశ్యామలమవుతుందని తెలిపారు. రైతులు పండించిన ప్రతి పంటకూ ప్రభుత్వం మద్దతు ధర చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్ధం వేణు, ఎంపీపీ వూట్కూరి వెంకటరమణారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ గుడిసె ఐలయ్య, ఏఎంసీ చైర్మన్‌ చింతపెల్లి వేణురావు, తహసీల్దార్‌ రాజిరెడ్డి, ఎంపీడీవో విజయ, వైస్‌ ఎంపీపీ సుధగోని శ్రీనాథ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌, ఆర్‌బీఎస్‌ మండలాధ్యక్షులు తిరుపతి, రాజిరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్లు తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, సర్పంచులు ఆనందరెడ్డి, భాగ్యలక్ష్మి, నారాయణ, జితేందర్‌ గౌడ్‌, సుదర్శన్‌, ఎంపీటీసీలు  నర్సయ్య, పుష్పలత, స్వప్న, తిరుపతి పాల్గొన్నారు. 


logo