బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 15, 2020 , 02:26:15

ఘనంగా నాబార్డు ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా నాబార్డు ఆవిర్భావ దినోత్సవం

కొత్తపల్లి: నగరంలోని స్వశక్తి కళాశాలలో మంగళవారం నాబార్డు 39వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాబార్డు డీజీఎం పాట్నా అనంత్‌ హాజరై మాట్లాడారు. నాబార్డు ద్వారా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 26 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలతో పాటు సాంకేతికపరమైన సలహాలు, సూచనలు ఇచ్చి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ఉత్తమ సేవలందిస్తున్న సుందరగిరి, కందుగుల రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు  అవార్డులు అందజేశారు. అనంతరం డీఆర్డీవో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసి అధిక దిగుబడి సాధించాలన్నారు. అనంతరం స్వశక్తి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనవికాస గ్రామీణాభివృద్ధి సంస్థ సీఈవో సంపత్‌కుమార్‌, రాజమౌళి, డైరెక్టర్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


logo