బుధవారం 30 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 14, 2020 , 03:37:32

జాగ్రత్తగా సేవలందించాలి

జాగ్రత్తగా సేవలందించాలి

  • త్వరలోనే జిల్లా దవాఖానలో   ఖాళీలు భర్తీ చేస్తాం
  • కొవిడ్‌-19 పరీక్షల కేంద్రాన్ని పెడతాం
  • కలెక్టర్‌ శశాంక
  • శాతవాహన, చల్మెడ,  ప్రభుత్వ దవాఖానల సందర్శన

కరీంనగర్‌ హెల్త్‌: కరోనా బాధితులకు సేవలందించే వైద్యులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక సూచించారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ, చల్మెడ వైద్యకళాశాల, జిల్లా ప్రధాన దవాఖానను డీఎంహెచ్‌వో సుజాతతో కలిసి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా శాతవాహన యూనివర్సిటీలోని ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కరోనా  బాధితులకు సేవలందించేందుకు అవసరమైన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ దవాఖానలో అందుతున్న వైద్య సేవలను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాలను అడిగి తెలుసుకున్నారు. చల్మెడ దవాఖానలో చైర్మన్‌ చల్మెడ లక్ష్మీనర్సింహారావును కలిసి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో కొవిడ్‌-19 పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే దవాఖానలో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు, శానిటైజర్లు విధిగా వాడాలని, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కలెక్టర్‌ వెంట డాక్టర్లు నాగశేఖర్‌, రవీందర్‌రెడ్డి, అలీం, శ్రీనివాస్‌, వసీం, జ్యోతి, రవీందర్‌, సాయిని నరేందర్‌ ఉన్నారు.logo