ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 14, 2020 , 03:37:34

కొనసాగుతున్న హరితహారం

కొనసాగుతున్న హరితహారం

  • భావితరాలకు బాసటగా నిలుద్దాం

గంభీరావుపేట : హరితహారంలో భాగంగా ప్రతిఒక్కరూ బాధ్యతగా మొక్కల నాటి వాటిని సంరక్షించి భావితరాలకు బాసటగా నిలుద్దామని ఏఎంసీ చైర్మన్‌ లింగన్నగారి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన లింగన్నపేటలో మహిళా సంఘాల సభ్యులకు ఇంటికి ఐదు చొప్పున మొక్కలను పంపిణీ చేశారు.  సర్పంచ్‌ చైతన్య, ఉప సర్పంచ్‌ రాజు, ఎంపీటీసీ రేణుక, ఐకేపీ సీసీ వనిత, నేతలు దొంతినేని వెంకట్రావు, కృష్ణమూర్తి, సభ్యులు పాల్గొన్నారు.

అడవులతోనే మానవాళికి మనుగడ 

ఎల్లారెడ్డిపేట : అడవులతోనే మానవాళి మనుగడ ఉంటుందని డీఎస్పీ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. బుగ్గరాజేశ్వర తండా, అక్కపల్లి గ్రామాల్లో సోమవారం ఆయన వేప మొక్కలు నాటి మాట్లాడారు. వేప మొక్కలను విరివిరిగా నాటితే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. అక్కపల్లిలో కొలుగూరు రాజేశ్వర్‌రావు సహకారంతో మూడు వందలు, బుగ్గ రాజేశ్వరతండాలో వంద మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, జడ్పీటీసీ లక్ష్మణ్‌రావు, ఎంపీపీ రేణుక, ఏఎంసీ చైర్మన్‌ నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, వైస్‌ ఎంపీపీ భాస్కర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, సర్పంచులు రజిత, మధుకర్‌, ఉప సర్పంచ్‌ జి.ప్రదీప్‌రెడ్డి, నాయకులు కిషన్‌, తిరుపతినాయక్‌ పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

రుద్రంగి : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ  మొక్కలు నాటాలని రుద్రంగి ఎస్‌ఐ మహేశ్‌ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా సోమవారం రుద్రంగి మండలం బడితండా గ్రామంలో నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ  మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించాలని అన్నారు. మొక్కలు నాటితేనే భావితరాలకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ పాషా, నాయకులు గజన్‌లాల్‌, రాందాస్‌, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

భాగస్వాములు కావాలి

బోయినపల్లి : హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్‌ కోరారు. సోమవారం మండలంలోని నీలోజిపల్లి, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ శ్మశాన వాటిక వద్ద మొక్కలు నాటారు. ప్రజల భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం అవుతుంద న్నారు.  వైస్‌ ఎంపీపీ నాగయ్య, నాయకులు కొండయ్య, భాస్కర్‌, లక్ష్మీనారాయణ, బాలమల్లు, బాల్‌రెడ్డి ఉన్నారు.


logo