శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 13, 2020 , 02:21:59

విందులకు పోలీసులు దూరంగా ఉండాలి

విందులకు పోలీసులు దూరంగా ఉండాలి

కరీంనగర్‌ క్రైం: ఎక్కువ మంది హాజరయ్యే వేడుకలకు పోలీసులు దూరంగా ఉండాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వైద్యుల సూచనలు, సలహాలను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. రోగ నిరోధకశక్తిని పెంపొందించే పోషకాహారం తీసుకోవడంతోపాటు, వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని తెలిపారు. శారీరకంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఉన్నతాధికారులకు సమాచారం అందించి, ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.


logo