గురువారం 13 ఆగస్టు 2020
Karimnagar - Jul 13, 2020 , 01:50:52

హరిత నగరంగా తీర్చిదిద్దుదాం

హరిత నగరంగా తీర్చిదిద్దుదాం

కార్పొరేషన్‌: కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో విరివిగా మొక్కలు నాటి హరిత నగరంగా తీర్చిదిద్దుదామని మేయర్‌ వై సునీల్‌రావు పిలుపు నిచ్చారు. హరితహారంలో భాగంగా ఆదివారం ఆయన 36వ డివిజన్‌లో కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీతో కలిసి మొక్కలు నాటారు.   ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ లక్ష్యం మేరకు మొక్కలు నాటి, సంరక్షిస్తామని తెలిపారు. డివిజన్ల వారీగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు మొక్కలు నాటడంతో పాటు బాధ్యతగా సంరక్షించాలన్నారు. నగరంలో కార్పొరేటర్ల సహకారంతో అన్ని డివిజన్లలో ఈనెల 22వ తేదీ నాటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లకు ఇరువైపులా నాటే మొక్కలకు ట్రీగార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు కోరిన మొక్కలను కొనుగోలు చేసి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో బ్లాక్‌ ప్లాంటేషన్‌ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ప్రజలు పాల్గొన్నారు. 

పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి

కార్పొరేషన్‌: ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మేయర్‌ వై సునీల్‌రావు పిలుపు నిచ్చారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు ‘ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా 17వ డివిజన్‌లో పలు ఇండ్లల్లో నిల్వ ఉన్న నీటిని మేయర్‌ తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఇంటి ఆవరణలో ఖాళీ డబ్బాలు, పాత టైర్లలో నీరు నిల్వ ఉండి దోమలు వృద్ధి చెంది, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఆదివారం పది నిమిషాలు ఇంటి పరిశుభ్రత కోసం కేటాయించాలన్నారు. పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సూచించారు.  ఇక్కడ కార్పొరేటర్‌ భాగ్యలక్ష్మి, డివిజన్‌ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. logo