శుక్రవారం 07 ఆగస్టు 2020
Karimnagar - Jul 13, 2020 , 01:37:48

భయం వద్దు.. బాధ్యతగా మెలగండి

భయం వద్దు.. బాధ్యతగా మెలగండి

నా పేరు సతీశ్‌.. కరీంనగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నా. నాతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ అని తెలియగానే హోం ఐసొలేషన్‌లో చికిత్స తీసుకున్నాం. నేను స్వతహాగా వైద్యుడిని కావడం వల్ల జాగ్రత్తలు పాటిస్తూనే ప్రభుత్వం ఇచ్చిన మెడిసిన్‌ వాడాం. తోటి వైద్యుల నుంచి సలహాలు తీసుకున్నా. రోజూ వేడి నీరు తీసుకోవడంతో పాటు ఆవిరి పట్టాం. ఆకు కూరలు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకున్నాం.. వైద్యాధికారులు ఎప్పటికప్పుడు మా ఆరోగ్య సమాచారం తెలుసుకునేవారు. పది రోజుల్లోనే అందరం కోలుకున్నాం. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాం. త్వరలోనే డ్యూటీలో జాయినవుతా. కరోనా పాజిటివ్‌ రాగానే భయపడద్దు. బాధ్యతగా మెలగాలి. లక్షణాలు ఎక్కువగా ఉంటే ప్రభుత్వం మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంది. చుట్టుపక్కల ఎవరికి పాజిటివ్‌ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి. శానిటైజర్‌ వినియోగించాలి. భౌతిక దురాన్ని పాటించాలి. - కరీంనగర్‌ హెల్త్‌logo