గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Jul 12, 2020 , 01:30:40

ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

  • కొత్తపల్లి ఎస్‌ఐ ఎల్లాగౌడ్‌కు గాయాలు

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ శివారులోని ఆర్టీసీ వర్క్‌షాపు సమీపంలో మంత్రి కాన్వాయ్‌ వెంట వస్తున్న ఎస్కార్ట్‌ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో కొత్తపల్లి ఎస్‌ఐ ఎల్లాగౌడ్‌ గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. శనివారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి రామడుగు మండలం వెలిచాల పర్యటన ముగించుకొని వస్తున్న క్రమంలో కొత్తపల్లి ఎస్‌ఐ ఎల్లాగౌడ్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్కార్ట్‌ వాహనంతో మంత్రి కాన్వాయ్‌లో చేరారు. ఆర్టీసీ వర్క్‌షాపు సమీపానికి రాగానే అతడి పరిధి ముగుస్తుండడంతో వాహనం పక్కకు తీసే క్రమంలో అదుపు తప్పి పల్టీ కొట్టింది. వాహనం ఎడమవైపునకు పడడంతో ఎస్‌ఐ బొటన వేలు తెగి చేతికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, వెంట ఉన్న పోలీసు సిబ్బంది వాహనం నుంచి సిబ్బందిని, ఎస్‌ఐని బయటికి తీశారు. వెంటనే స్థానిక ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఎల్లాగౌడ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు దవాఖానకు చేరుకొని వివరాలు అడిగి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 


logo