మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 11, 2020 , 01:37:20

నేడు రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ

నేడు రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ

రామడుగు: మండలంలోని వెలిచాల శివారులో రైతువేదిక నిర్మాణ పనులకు శనివారం భూమిపూజ నిర్వహించేందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ రానున్నారు. ఇందులో భాగంగా ముందస్తుగా శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, రామడుగు సింగిల్‌ విండో చైర్మన్‌ వీర్ల వెంకటేశ్వరరావు వెలిచాల గ్రామాన్ని సందర్శించారు. గ్రామ శివారులోని సర్వే నంబర్‌ 141లో రైతు వేదిక నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు మంత్రులు రానుండగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి వెన్నెముక అయిన అన్నదాతను అక్కున చేర్చుకున్న సీఎం కేసీఆర్‌, రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని పరిష్కరించేందుకే గ్రామాల్లో రైతు వేదికలను నిర్మిస్తునట్లు తెలిపారు. మంత్రులకు ఘన స్వాగతం పలికి,  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులను, టీఆర్‌ఎస్‌ శ్రేణులను కోరారు. ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, రైతు బంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ జూపాక కరుణాకర్‌, ఏడీఏ రామారావు, ఏవో యాస్మిన్‌, మాజీ ఎంపీపీ కిష్టారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, తదితరులున్నారు. logo