శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 10, 2020 , 02:34:42

జడ్పీ ఉన్నత పాఠశాలలో హరితహారం

జడ్పీ ఉన్నత పాఠశాలలో హరితహారం

కొత్తపల్లి: కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాధికారి ఎన్‌వీ దుర్గాప్రసాద్‌,  మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు పాల్గొని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో 200 మొక్కలు నాటి సంరక్షిస్తామని చైర్మన్‌ తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ మొక్కల ఆవశ్యకతను విద్యార్థులకు వివరించి సంరక్షించే బాధ్యత తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి రాజభాను చంద్రప్రకాశ్‌, విద్యాకమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, రవీందర్‌, ప్రధానోపాధ్యాయురాలు జలజారాణి, ఉపాధ్యాయులు,  గ్రామస్తులు పాల్గొన్నారు.  

పారిశుద్ధ్య సిబ్బందికి కిట్లు పంపిణీ

కొత్తపల్లి: మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో పారిశుద్ధ్య సిబ్బంది 25 మందికి గురువారం చైర్మన్‌ రుద్ర రాజు దుస్తుల కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కిట్‌లో బూట్లు, గ్లౌసులు, మాస్కులు, శానిటైజర్లు, దుస్తులు ఉంటాయన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కౌన్సిలర్లు రాంబాబు, జెర్రిపోతుల మొండయ్య, మానుపాటి వేణుగోపాల్‌, జెర్రిపోతుల శ్రీకాంత్‌, గున్నాల రమేశ్‌, మున్సిపల్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. logo