శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 10, 2020 , 02:35:05

కేసుల వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలి

కేసుల వివరాలు రికార్డుల్లో నమోదు చేయాలి

తిమ్మాపూర్‌: కేసుల వివరాలు ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేసి, పెండింగ్‌ లేకుండా చూసుకోవాలని ఏసీపీ విజయసారథి ఆదేశించారు.  తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో గురువారం కరీంనగర్‌ డివిజన్‌ స్థాయి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఉన్న కేసుల పెండింగ్‌ రికార్డులను పరిశీలించి, సలహాలు, సూచనలు చేశారు. రౌడీ షీటర్లుగా నమోదైన కేసులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. దొంగతనం కేసులపై నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్‌ రూరల్‌ పరిధిలోని సీఐలు తుల శ్రీనివాసరావు, మహేశ్‌గౌడ్‌, సంతోష్‌కుమార్‌, చొప్పదండి, గంగాధర, రామడుగు, కరీంనగర్‌ రూరల్‌, కొత్తపల్లి, తిమ్మాపూర్‌, గన్నేరువరం, చిగురుమామిడి, పోలీస్‌ స్టేషన్ల ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.logo