శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 10, 2020 , 02:35:28

జాతీయ రూర్బన్‌ పనుల్లో వేగం పెంచాలి

జాతీయ రూర్బన్‌ పనుల్లో వేగం పెంచాలి

  •   కలెక్టర్‌ శశాంక 
  •   వివిధ శాఖల అధికారులతో సమీక్ష

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: జాతీయ రూర్బన్‌ పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, ఏఈలు, డిప్యూటీ ఈఈలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎఫ్‌ఆర్‌వోలతో గురువారం జాతీయ రూర్బన్‌ పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీసీ, బీటీ రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, కూరగాయల పందిళ్లు, టూరిజం పనులు, అంగన్‌వాడీ సెంటర్లు, పాఠశాలల భవనాలు, అదనపు తరగతి గదులు, ఓపెన్‌ జిమ్‌ నిర్మాణాలకు ఎన్‌ఆర్‌ఐజీఎస్‌లో భాగంగా సీజీఎఫ్‌ ద్వారా నిధులు కేటాయించినట్లు తెలిపారు. పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. ప్రగతిలో ఉన్న 33 పనులు వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. రూర్బన్‌ పథకం కింద రూ.101.11 కోట్లు, కన్వర్జెన్సీ కింద రూ.71.11 కోట్లు, ఎన్‌ఆర్‌యూఎంసీజీఎఫ్‌ నిధులు రూ.30 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్‌రావు, జిల్లా సంక్షేమాధికారి శారద, పంచాయతీరాజ్‌ ఎస్‌ఈ విష్ణువర్ధన్‌, ఏఈలు, డిప్యూటీ ఈఈలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎఫ్‌ఆర్‌వోలు, తదితరులు పాల్గొన్నారు.


logo