మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 09, 2020 , 01:24:21

కలుపుతీతలో ‘యంత్ర’సాయం

కలుపుతీతలో ‘యంత్ర’సాయం

పత్తి సాగు పెరిగిన నేపథ్యంలో కలుపు తీసేందుకు వినూత్న యంత్రాలను వినియోగిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పని జరిగేలా కొత్త పరికరాలను సమకూర్చుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన యువరైతు బోరుగాయ ప్రసాద్‌ రూ.36 వేలతో వేములవాడలో కలుపుతొలగించే యంత్రం కొనుగోలు చేశాడు. ఒక లీటర్‌ పెట్రోల్‌తో దాదాపుగా ఎకరం కలుపు తీయవచ్చని చెబుతున్నాడు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన మరో యువరైతు మెరుగు శ్యాం వరంగల్‌ జిల్లా పరకాల నుంచి 3 హెచ్‌పీ ఇంజిన్‌తో పాటు విడి భాగాలను తీసుకువచ్చి కలుపు తొలగించే యంత్రాన్ని సొంతంగా తయారు చేసుకున్నాడు. ఈ యంత్రంతో రోజుకు దాదాపు ఐదెకరాల్లో కలుపు తీస్తున్నాడు. ఒక్కో ఎకరానికి లీటర్‌ డీజిల్‌ ఖర్చవుతుందని, కిరాయికి వెళ్తే ఎకరానికి రూ.800 తీసుకుంటున్నట్లు తెలిపాడు. - చందుర్తి/ గంగాధరlogo