శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 09, 2020 , 01:22:05

వరప్రదాయని శ్రీరాంసాగర్‌

వరప్రదాయని శ్రీరాంసాగర్‌

హన్మకొండ/న్యూశాయంపేట: ఎస్సారెస్పీ వరద కా లువ వరప్రదాయని కావాలని, కాలువల ద్వారా నీటి విడుదల, పంపిణీ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు. బుధవారం హన్మకొండ హంటర్‌రోడ్డులోని సీఎస్‌ ఆర్‌ గార్డెన్‌లో  ఎస్సారెస్పీ ప్రాజెక్టు, లోయర్‌ మానేర్‌డ్యాం నుంచి వానకాలంలో నీటి విడుదలపై జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన  హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.  ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల లక్ష్యాలు నెరవేరాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు బంధు సమితి సభ్యులు సమన్వయంతో  ముందుకు సాగాలని కోరారు. ఒక్క నీటి చుక్కా వృథాకాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.  ఎస్సారెస్పీ కాలువల ద్వారా వందకు వంద శాతం చెరువులు నింపుతున్నాం కాబట్టే రెండో పంటకు నీరు అందించాలన్నారు. పంటల సాగు పద్ధ్దతిని సంస్కరించాలన్నారు.  ఉపాధి హామీ పథకం కింద కాలువలను అభివృద్ధి చేయాలని సూ చించారు.  చివరి ఆయకట్టుకు, చిట్ట చివరి రైతుకు   సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జులై 15న కాలువలకు నీటిని విడుదల చేయాలని చెప్పారు. పాత కాలువలను మరమ్మతు చేయించాలన్నారు.  ఈ మేరకు భూసేకరణ  చేపట్టాలన్నారు. సీఎం కేసీఆర్‌ పెద్ద మనసుతో రైతులను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు.  సాగుకే సర్కారు తొలి ప్రాధాన్యమిస్తుందని స్పష్టం చేశారు. అధికారులు, కలెక్టర్లు,  నిరంతరం నీటి విడుదలను పర్యవేక్షించాలన్నారు. ఎల్‌ఎండీ కింద 9లక్షల ఎకరాల కు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. 

నీటిని పొదుపుగా వాడాలి..

 ప్రతి నీటి చుక్కనూ  పొదుపుగా వాడుకోవాలని మా నకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ రైతుల కు సూచించారు. కాలువల మరమ్మతుకు సర్కారు చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇందుకు రైతులు సహకరించాలని కోరారు.  కార్యక్రమంలో మంత్రు లు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ పాల్గొన్నారు.


logo