శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Karimnagar - Jul 09, 2020 , 01:17:11

జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

రామగిరి: జమ్మూకశ్మీర్‌లో మృతిచెందిన రామగిరి మండలం నాగేపల్లికి చెందిన జవాన్‌ సాలిగాం శ్రీనివాస్‌కు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికా రు. బంధువులు, మిత్రులు అశ్రునయనాల మధ్య అంతిమ సంస్కారాలు నిర్వహించారు. బుధవా రం  శ్రీనివాస్‌ మృతదేహం అంబులెన్స్‌లో స్వగ్రామానికి వస్తుందనే సమాచారం మేరకు గ్రామస్తు లు, స్నేహితులు భారీగా తరలివచ్చారు. మండల సరిహద్దు మంథని పెద్దపల్లి ప్రధాన రహదారి కల్వచర్ల నుంచే నాగేపల్లికి బైక్‌ ర్యాలీగా మృతదేహం తీసుకురాగా, తల్లిదండ్రులు, భార్య మమత రోదించిన తీరు కంటతడి పెట్టించింది. 

ప్రముఖుల సంతాపం..

అంతకుముందే గ్రామానికి చేరుకున్న పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రీనివాస్‌ మృతికి సంతాపం తెలిపారు. ఇంటికి వెళ్లి కుటుం బ సభ్యులను పరామర్శించారు. జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఆర్మీ సుబేదార్‌ స్వామినాథం, మంథని ఆర్డీవో కృష్ణవేణి, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, జడ్పీటీసీ శారద, ఏఎంసీ చైర్మన్‌ సత్యనారాయణగౌడ్‌, వైస్‌ ఎంపీపీ శ్రీదేవి, సర్పంచ్‌ ఓదెలు యాదవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రవీందర్‌, ఆరెల్లి కొమురయ్య గౌడ్‌, మ్యాదరవేన కుమార్‌ నివాళులర్పించారు. 

కుటుంబాన్ని ఆదుకోవాలి: పుట్ట మధూకర్‌

శ్రీనివాస్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ కోరారు. నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల ప్రాణాలు కోల్పోతున్న సైనికులకు వర్తించే ప్రయోజనాలనే కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాము కూడా అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. 

దాడి పొడవునా..

జవాన్‌ శ్రీనివాస్‌కు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. బంధువులు, మిత్రులు తరలివచ్చారు. పార్థివదేహాన్ని వ్యాన్‌లో గ్రామ శివారుకు తీసుకెళ్లగా, అశ్రునయనాల మధ్య అంతిమ యాత్ర నిర్వహించారు. దారిపొడవునా ‘భారత్‌ మాతాకీ జై.. శ్రీనివాస్‌ అమర్‌ రహే’ అంటూ నినదించి, కన్నీటి వీడ్కోలు పలికారు.logo