శుక్రవారం 07 ఆగస్టు 2020
Karimnagar - Jul 08, 2020 , 01:48:07

వాలీబాల్‌లో సత్తా చాటుతున్న ఊట్‌పల్లి యువకుడు

 వాలీబాల్‌లో సత్తా చాటుతున్న ఊట్‌పల్లి యువకుడు

కథలాపూర్‌: పట్టుదల ఉంటే సాధించలేనిదేమీ ఉండదని నిరూపిస్తున్నాడీ యువకుడు. పుట్టి పెరిగింది పల్లెటూరిలోనే అయినా ఖాళీ స్థలాలను క్రీడా మైదానంగా భావించి వాలీబాల్‌ నేర్చుకున్నాడు. కష్టపడి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగి క్రీడల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నాడు ఊట్‌పెల్లికి చెందిన ప్రవీణ్‌. 

పట్టుదలతో ముందడుగు..

స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు,  పక్క గ్రామమైన భూషణరావుపేటలో పదో తరగతి వరకు చదివాడు. అప్పుడప్పుడూ సంఘాల ఆధ్వర్యంలో జరిగే వాలీబాల్‌ పోటీలను చూసేవాడు. దీంతో వాలీబాల్‌ క్రీడపై ఆసక్తి పెంచుకున్నాడు. మండల స్థాయిలో ప్రతిభ చూపడంతోపాటు జిల్లాస్థాయిలో సత్తా చాటాడు. ప్రవీణ్‌ ప్రతిభ చూసిన సీనియర్‌ క్రీడాకారులు ప్రోత్సహించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాలొనేందుకు అవకాశం కల్పించారు. కరీంనగర్‌లోని వాణీనికేతన్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. వాలీబాల్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్‌లో గురాన్‌పురలో నిర్వహించిన అండర్‌-19 పోటీల్లో పాల్గొని జాతీయస్థాయిలో సత్తా చాటాడు. ఆ తర్వాత మ ధ్యప్రదేశ్‌లో నేషనల్‌ యూత్‌ నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాడు. తమిళనాడులో సౌత్‌ సెంట్రల్‌ నేషనల్‌ వారు నిర్వహించిన పోటీల్లో పాల్గొని బహుమతులు దక్కించుకున్నాడు. గతేడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నిర్వహించిన యూనివర్సిటీ లెవెల్‌ పోటీల్లో శాతావాహన యూనివర్సిటీ తరఫున ప్రవీణ్‌ పాల్గొన్నాడు. పల్లెటూరిలో పెరిగిన ప్రవీణ్‌ జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీల్లో రాణించడంతో క్రీడాకారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. logo