ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 08, 2020 , 01:37:30

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాలి

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచాలి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: అండర్‌గ్రౌండ్‌ డ్రైనే జీ, హరితహారం  పనుల్లో వేగం పెంచి గడువు లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ శశాంక అధికా రులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, హరితహారంపై మేయర్‌ సునీల్‌రావు, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతి, ము న్సిపల్‌ అధికారులు, కన్సల్టెంట్లతో  సమావేశమ య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానలు కురిస్తే పనులకు ఆటంకం కలుగుతుందని,  ఈ పరిస్థితుల్లో ప్రధాన రహదారుల్లో చాం బర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.  రోడ్డు ని ర్మాణ పనుల్లో ఎలక్ట్రికల్‌ పోల్స్‌ షిప్టింగ్‌, డ్రైనైజీల నిర్మాణానికి ఎంత మంది కూలీలు అవసరమో  ఎన్ని రోజుల్లో పనులు పూర్తవుతాయో  ప్రణాళి కలు రూపొందించి మున్సిపల్‌ కమిషనర్‌కు అప్పగించాలని ఏజెన్సీల కాంట్రాక్టర్లను ఆదేశించారు.    ఇంజినీరింగ్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షించి పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకో వాలన్నారు.  వారానికోసారి ఏజెన్సీ, కాంట్రాక్టర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి స్మార్ట్‌ సిటీ పను ల పురోగతిని తెలుసుకుని మున్సిపల్‌ కమిషనర్‌కు వివరాలు అందజేయాలని నిర్దేశించారు.     గడువులోగా పనులు పూర్తి చేయకుంటే నోటీసు లు జారీ చేయాలని  కమిషనర్‌ను ఆదేశించారు.  అనంతరం  హరితహారంలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌, బ్లాక్‌ ప్లాంటేషన్‌, యాదాద్రి మోడల్‌ లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు.  అధికారులకు ని ర్దేశించిన టార్గెట్‌ ప్రకారం జూలై 28 వరకు ప్లాం టేషన్‌ పూర్తి చేయాలని, లేదంటే వారికి నోటీసు లు జారీ చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్‌ఈ కృష్ణారావు, పీవీ రామన్‌, డీవైఈఈ ఓం ప్రకాశ్‌, వెంకటేశ్వర్లు, ఏఈ మోహన్‌రెడ్డి, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, యూకేఎస్‌హెచ్‌వో కన్సల్టెంట్లు, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.

వాతావరణ సమతుల్యతను కాపాడాలి..

కార్పొరేషన్‌: నగరంలో విరివిగా మొక్కలు నాటి వాతావరణ సమతుల్యతను కాపాడాలని  కలెక్టర్‌ శశాంక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  ఆరో విడుత హరితహరంలో భాగంగా శాతవాహన యూనివర్సిటీ  ఆవరణలో  మేయర్‌ వై సునీల్‌రావుతో కలిసి మొ క్కలు నాటారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీలోని మూడు ఎకరాల స్థలం లో 3 వేల మొక్కలు నాటుతున్నామని తెలిపారు.  నగరవ్యాప్తంగా ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు తీసు కుం టున్నామని పేర్కొన్నారు. ఇంటింటికీ ఐదు మొక్కలను అందజేస్తామని చెప్పారు. అవసరమైతే కొనుగోలు చేసి పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.  బావి తరాల కోసం ప్రతి ఒక్కరూ హరితోద్యమం లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.   కార్యక్రమంలో నగర కమిషనర్‌ క్రాంతి, కార్పొ రేటర్లు, నగరపాలక అధికారులు, యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ భరత్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


logo