గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Jul 07, 2020 , 02:19:32

చింతకుంటను హరిత నిలయంగా తీర్చిదిద్దాలి

చింతకుంటను హరిత నిలయంగా తీర్చిదిద్దాలి

  • అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌

కొత్తపల్లి: మండలంలోని చింతకుంటలో విరివిగా మొక్కలు నాటి, సంరక్షిస్తూ హరిత నిలయంగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ పిలుపు నిచ్చారు. చింతకుంట శివాలయం ఆవరణలో సోమవారం హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని సూచించారు. స్మృతివనం, అవెన్యూ ప్లాంటేషన్‌, సమ్మక్క-సారక్క గద్దెల వద్ద చేస్తున్న ప్లాంటేషన్‌కు డ్రిప్‌ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనంతరం శ్మశానవాటిక నిర్మాణ పనులను పరిశీలించారు.  ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌ చిల్ల శ్రీనివాస్‌, ఎంపీటీసీ భూక్య తిరుపతినాయక్‌, ఉప సర్పంచ్‌ గుర్రాల మంగ, మాజీ ఉప సర్పంచులు సమ్మయ్య, పట్టం లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు శ్రీధర్‌, సత్యంగౌడ్‌, కమల్‌, కో ఆప్షన్‌ సభ్యులు కేశవరెడ్డి, నాగరాజు, భాగ్యలక్ష్మి, సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. logo