శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 07, 2020 , 02:19:34

కల్లాల ఏర్పాటు చారిత్రాత్మకం

కల్లాల ఏర్పాటు చారిత్రాత్మకం

  •  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  •  కొలిమికుంటలో నిర్మాణ పనులు ప్రారంభం

  చొప్పదండి: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న  కల్లాల ఏర్పాటు నిర్ణయం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని కొలిమికుంటలో కల్లం నిర్మాణ పనులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని తెలిపారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షానికి తడిసి నష్టపోయినా గత పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో వెయ్యి  కల్లాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఎస్సీలకు పూర్తి రాయితీ, మిగతా రైతులు 10 శాతం చెల్లించాలని సూచించారు. గ్రామాల్లో కల్లాల నిర్మాణంపై ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కెనాల్‌ వెంట హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్‌, సర్పంచ్‌ తాళ్లపల్లి సుజాత, ఎంపీటీసీ తోట కోటేశ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, కౌన్సిలర్‌ కొత్తూరి మహేశ్‌, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, ఎంపీడీవో స్వాతి, ఏవో వంశీ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, నలుమాచు రామకృష్ణ, లోక రాజేశ్వర్‌రెడ్డి, గొల్లపల్లి శ్రావణ్‌, మహేశుని మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.   

రైతులను ప్రోత్సహించాలి

గంగాధర: నియోజకవర్గంలోని ప్రతి రైతు తన పొలంలో కల్లం నిర్మించుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రోత్సహించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సూచించారు. బూరుగుపల్లిలో గంగాధర సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గొర్రెల పెంపకం కోసం రూ. 6 లక్షలు, బర్రెల పెంపకం కోసం రూ. 2 లక్షల విలువ గల రుణాల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం బూరుగుపల్లిలో కల్లం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో వెయ్యి కల్లాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు.  కల్లాల నిర్మాణంపై ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, ఏఎంసీ చైర్మన్‌ సాగి మహిపాల్‌రావు, సింగిల్‌విండో అధ్యక్షుడు దూలం బాలగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ వేముల భాస్కర్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ తాళ్ల సురేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మడ్లపెల్లి గంగాధర్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అట్ల రాజిరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


logo