బుధవారం 05 ఆగస్టు 2020
Karimnagar - Jul 06, 2020 , 00:53:26

విరివిగా మొక్కలు నాటాలి

విరివిగా మొక్కలు నాటాలి

గన్నేరువరం: ఆరో విడుత హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములవ్వాలని, విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో రూ.9 లక్షలతో సైన్స్‌ ల్యాబ్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం హరితహారంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం హరితహారం చేపట్టిందన్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జడ్పీహెచ్‌ఎస్‌లో సైన్స్‌ ల్యాబ్‌తోపాటు స్టేజీ నిర్మాణం సైతం చేపట్టాలని సూచించారు.

జడ్పీటీసీకి అభినందన

మండల కేంద్రంలోని యువసేవ కార్యాలయంలో జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అభినందనలు తెలిపారు. కేక్‌ కట్‌ చేశారు. అనంతరం మండల కేంద్రానికి చెందిన రాపోలు కనుకయ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీతోపాటు ఆర్‌బీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, మాజీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్‌ రావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, వైస్‌ ఎంపీపీ న్యాత స్వప్న, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ బోడ మాధవరెడ్డి, కో ఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ రఫీ, సర్పంచులు పుల్లెల లక్ష్మి, గంప మల్లీశ్వరి, కుమ్మరి సంపత్‌, నక్క మల్లయ్య, ఉప సర్పంచ్‌ బూర వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు కట్టా రవీంద్రాచారి, ఎస్‌ఎంసీ చైర్మన్‌ బుర్ర సత్తయ్య గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పుల్లెల లక్ష్మణ్‌, న్యాత సుధాకర్‌, తోట కోటేశ్వర్‌, ఎలేటి చంద్రారెడ్డి, గంప వెంకన్న, గొల్లపెల్లి రవి, జాలి లింగారెడ్డి, రాజయ్య, గూడూరి సురేశ్‌, రామంచ స్వామి, జాలి తిరుపతి రెడ్డి, బుర్ర జనార్దన్‌, బుర్ర మల్లేశ్‌ గౌడ్‌, బోయిని అంజయ్య, బేతెల్లి రాజేందర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డి, వంగల సత్యనారాయణ రెడ్డి, సంపత్‌ పాల్గొన్నారు.


logo