ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 06, 2020 , 00:19:50

కుల సంఘాల అభివృద్ధికి కృషి

కుల సంఘాల అభివృద్ధికి కృషి

గంగాధర: కుల సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌  ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ స్పష్టం చేశారు. మండలంలోని నారాయణపూర్‌లో రూ. 23 లక్షలతో నిర్మించనున్న గౌడ, కుర్మ కుల సంఘ, స్వశక్తి భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసి పను లు ప్రారంభించారు. నారాయణపూర్‌ తాటి వనంలో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో హరితహారం నిర్వహించగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. మండువాలో గౌడ సంఘం సభ్యులతో మాట్లాడారు. స్వయంగా ఎమ్మెల్యే గౌడుగా మారి నాయకులకు కల్లు పోశారు. పర్యావరణ పరిరక్షణకు సర్కారు చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్‌, జడ్పీటీసీ పుల్కం అనురాధ, ఏఎంసీ చైర్మన్‌ సాగి మహిపాల్‌రావు, విండో అధ్యక్షుడు దూలం బాలగౌడ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, వైస్‌ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ వేముల భాస్కర్‌, సర్పంచ్‌ ఎండీ నజీర్‌, ఎంపీటీసీ ఎగుర్ల మల్లమ్మ, ఏఎంసీ డైరెక్టర్‌ గర్వందుల పర్శరాములు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 పరిసరాల శుభ్రత అందరిబాధ్యత

చొప్పదండి : పరిసరాల శుభ్రత మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమం నిర్వహించారు. క్యాంపు ఆవరణలో పెరిగిన గడ్డిని ఎమ్మెల్యే స్వయంగా తొలగించి మున్సిపల్‌ ట్రాక్టర్‌లో వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే కేటీఆర్‌ ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిముషాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఇందులో ప్రజలు సైతం పాల్గొని ఎవరి ఇంట్లో వారు ఇంటి ఆవరణలో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని  నీటి నిల్వలను తొలగించాలని పిలుపునిచ్చారు. ఇంట్లోకి దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా ఆరోగ్యసూత్రాలు పాటించాలని సూచించారు. కరోనా వైరస్‌పై ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకూడదని, ప్రతి ఒక్కరూ మాస్కు లు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.   logo