మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 05, 2020 , 00:57:06

పెట్రో ధరల పెంపుపై నిరసనల వెల్లువ

పెట్రో ధరల పెంపుపై నిరసనల వెల్లువ

కోరుట్ల టౌన్‌: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శనివారం కాంగ్రెస్‌ మండల నాయకులు తహసీల్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ముడి చమురు ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు కొంతం రాజం, నాయకులు బోయినిపల్లి సత్యంరావు, వెంకటేశ్‌గౌడ్‌ ఉన్నారు. కాంగ్రెస్‌ పట్టణ నాయకులు మున్సిపల్‌ కమిషనర్‌ ఆయాజ్‌కు వినతి పత్రం అందజేశారు. కొత్త బస్టాండ్‌ సమీపంలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేసి ధరల పెంపుపై నిరసన తెలిపారు. నాయకులు  గంగాధర్‌, నయీమ్‌, సోగ్రాబీ, నర్సయ్య, వెంకటేశ్‌, సత్యనారాయణ, అక్బర్‌, అజయ్‌,  అశోక్‌, రాజేశం, రవి, శ్రవణ్‌, హరినాథ్‌, పవన్‌, శ్రీకాంత్‌, హరీశ్‌ ఉన్నారు. 

ఇబ్రహీంపట్నం: మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో శనివారం పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు తహసీల్దార్‌ స్వర్ణకు వినతిపత్రం అందజేశారు. యూత్‌ కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు శ్రీకాంత్‌, నాయకులు చైతన్య, చిన్నరాజు, ప్రకాశ్‌, శ్రీకాంత్‌, ప్రశాంత్‌, శ్రీకర్‌, రాజేశ్‌, నితీశ్‌, రాజేందర్‌ ఉన్నారు. 

మెట్‌పల్లి టౌన్‌: పెట్రో ధరలు తగ్గించాలని కోరుతూ మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌ గౌడ్‌కు శనివారం కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రం అందించారు. అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జువ్వాడి నర్సింగరావు జన్మదినం సందర్భంగా మెట్‌పల్లి సివిల్‌ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పట్టణాధ్యక్షుడు కుతుబుద్దీన్‌, నాయకులు జెట్టి లింగం, బాల్క మోహన్‌, బర్ల రమేశ్‌, దుర్గం రమేశ్‌, అందె మారుతి, రమేశ్‌, జెట్టి లక్ష్మణ్‌ పాల్గొన్నారు. 

కొడిమ్యాల: పెట్రో ధరలకు నిరసనగా తహసీల్దార్‌కు శనివారం కాంగ్రెస్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. పార్టీ మండలాధ్యక్షుడు నారాయణగౌడ్‌, మల్లికార్జున్‌రెడ్డి, నాగభూషన్‌రెడ్డి, స్వామి, రాజయ్య, శ్రీనివాస్‌ ఉన్నారు. 

మేడిపల్లి : పెట్రో ధరలు తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్‌ నాయకులు తహసీల్దార్‌ రాజేశ్వర్‌కు వినతి పత్రాన్ని  అందజేశారు. సర్పంచ్‌ లచ్చానాయక్‌, నాయకులు శంకర్‌, నరేశ్‌రెడ్డి, విజయ్‌, ప్రశాంత్‌, నర్సయ్య, మల్లేశం, దామోదర్‌, దశరథ్‌రెడ్డి, సంజీవ్‌, అజయ్‌, నర్సారెడ్డి, గంగాధర్‌, సయ్యద్‌, జీవన్‌, లక్ష్మణ్‌, నరేశ్‌, భీమయ్య పాల్గొన్నారు.

సారంగాపూర్‌ : పెట్రో ధరలను తగ్గించాలని రాష్ట్రపతికి మెమోరాండం పంపించాలని కోరుతూ తహసీల్దార్‌ నాగార్జుకు బీర్‌పూర్‌ ఎంపీపీ రమేశ్‌, కాంగ్రెస్‌ నాయకులు వినతి పత్రం అందజేశారు. జడ్పీటీసీ పద్మ, మండల ఉపాధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, సింగిల్‌ విండో చైర్మన్‌ నవీన్‌రావు, నాయకులు లక్ష్మణ్‌, రమేశ్‌, సుభాష్‌, జితేందర్‌, శ్రీనివాస్‌, రాజేశం, ప్రభాకర్‌, సుధాకర్‌, శంకర్‌ పాల్గొన్నారు.


logo