శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 05, 2020 , 00:57:08

గడువులోగా లక్ష్యం చేరుకోవాలి

గడువులోగా లక్ష్యం చేరుకోవాలి

  •  కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ n పలు గ్రామాల్లో అధికారులతో కలిసి రైతు వేదిక పనుల పరిశీలన

గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్‌: రైతు వేదిక నిర్మాణాలను గడువులోగా పూర్తి చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ అధికారులను ఆదేశించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబా ద్‌ మండలాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను శనివారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. మంత్రి కేటీఆర్‌ సొంత ఖర్చులతో గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మిస్తున్న వేదికను పరిశీలించారు. పనుల పురోగతిని నిత్యం పరిశీలిస్తూ అం దుబాటులో ఉండాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మాణ స్థలాన్ని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావుతో కలిసి పరిశీలించారు. పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. బొప్పాపూర్‌లో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుండడంతో దాత, అధికారులను అభినందించారు. ముస్తాబాద్‌ మండల కేంద్రం తో పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయాధికారి రణధీర్‌కుమార్‌, ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, మండల కన్వీనర్లు ధ్యానబోయిన రాజేందర్‌, రాధారపు శంకర్‌, కల్వకుంట్ల గోపాల్‌రావు, ఏవోలు పూర్ణిమ, భూంరెడ్డి, ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ, ఏఎంసీ చైర్మన్లు దయాకర్‌రావు, నర్సింహారెడ్డి, తహసీల్దార్లు సుమ, శ్రీకాంత్‌, సర్పంచులు శ్రీధర్‌, బాల్‌రెడ్డి, ఎంపీటీసీ రాజేందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు కొమిరిశెట్టి లక్ష్మణ్‌, వంగ సురేందర్‌రెడ్డి, కిషన్‌రావు, పిల్లి కిషన్‌, ఇల్లెందుల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


logo