ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 04, 2020 , 02:46:15

సెల్ఫ్ లాక్‌డౌన్‌కు సహకరించాలి

సెల్ఫ్ లాక్‌డౌన్‌కు సహకరించాలి

తిమ్మాపూర్ : కరోనా కట్టడి కోసం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్ (అల్గునూర్)లో శనివారం నుంచి సెల్ఫ్ లాక్‌డౌన్ విధిస్తున్నామని, దీనికి అన్ని వర్గాలు సహకరించాలని ప్రజాప్రతినిధులు కోరారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ సల్ల శారద రవీందర్, కేడీసీసీబీ డైరెక్టర్ సింగిరెడ్డి స్వామి రెడ్డి శుక్రవారం ఉదయం స్థానిక డివిజన్ కార్యాలయంలో దుకాణాదారులు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు, వ్యాపారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంచాలన్నారు. ప్రతి దుకాణంలో శానిటైజర్ ఏర్పాటు చేయాలని సూచించారు. టీ, టిఫిన్స్ సెంటర్లు, సెలూన్లు 15 రోజుల పాటు మూసేయాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. ఈ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. నాయకులు కంది రాంచంద్రారెడ్డి, జాప రవీందర్ రెడ్డి, జాప శ్రీనివాస్ రెడ్డి, పడాల రమేశ్, కంది అశోక్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కనుకయ్య, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.logo